మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' తదితర తెలుగు సినిమాలతో పాటు 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం రాబోతున్నాయి. మన దగ్గర రిలీజయ్యేవన్నీ కూడా చిన్న మూవీస్, దానికి తోడు వేటిపైనా అస్సలు బజ్ లేదు.
(ఇదీ చదవండి: నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్)
మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్', యూత్, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మృణాల్ ఠాకుర్ 'దో దివానే షెహర్ మై' మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు చూడొచ్చనేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు)
నెట్‌ఫ్లిక్స్
టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15
యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16
ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16
WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16
దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17
ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17
అమెజాన్ ప్రైమ్
ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13
యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13
అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17
హాట్‌స్టార్
సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15
ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17
ఆహా
పోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17
జీ5
రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14
భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15
ఆపిల్ టీవీ ప్లస్
మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
లయన్స్ గేట్ ప్లే
గుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 17
బుక్ మై షో
ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17
(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)


