ఏడాదిగా ట్రెండింగ్‌లో తమిళ్‌ సాంగ్‌.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌ | Love Insurance Kompany Dheema Telugu Song Out Now, Sung By Anirudh Ravichander Wins Hearts | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌ సాంగ్‌ తెలుగు వర్షన్‌ వచ్చేసింది.. అదరగొట్టిన అనిరుధ్‌

Apr 2 2026 11:14 AM | Updated on Apr 2 2026 11:48 AM

Love Insurance Kompany: Dheema Telugu Song Out Now

గత ఏడాదిగా ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఎక్కడ చూసినా ఓ పాట తెగ వైరలయింది. అదే లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సినిమాలోని ధీమా పాట. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్‌ విఘ్నేశ్‌యే ఈ ధీమా పాటకు సైతం లిరిక్స్‌ అందించాడు. అనిరుధ్‌ తన గాత్రంతో దాన్ని మరింత అందంగా ఆలపించాడు. 

'ధీమా' తెలుగు సాంగ్‌ రిలీజ్‌
ఈ పాట రిలీజ్‌ చేసినప్పటినుంచి చాలామందికి ఇది ఫేవరెట్‌ అయిపోయింది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్‌ వదిలారు. హృదయపు కోటే.. దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే.. అంటూ పాట మొదలవుతుంది. ఇది చూసిన అభిమానులు.. లేటుగానైనా సరే తెలుగులో రిలీజ్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పాటను మీరూ వినేయండి..

సినిమా
లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి, స్టార్‌ హీరోయిన్‌ నయనతార నిర్మిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్‌, మాళవిక కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement