ఉప్పెన బ్యూటీ ఎల్‌ఐకే.. తెలుగు టీజర్ రిలీజ్ | Pradeep Ranganathan Love Insurance Kompany Telugu Teaser out now | Sakshi
Sakshi News home page

LIK Movie: 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇంకా ఉంది'.. తెలుగు టీజర్ రిలీజ్

Apr 1 2026 11:45 AM | Updated on Apr 1 2026 12:24 PM

Pradeep Ranganathan Love Insurance Kompany Telugu Teaser out now

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, ప్రదీప్ రంగనాథన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ఎల్‌ఐకే((లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. గతేడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీని సెవెన్‌ స్క్రీన్స్‌ స్టూడియో, రౌడీ పిక్చర్స్‌ బ్యానర్లపై నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ప్రేమకథగానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం.. కానీ ఒకడు లేని విషయాన్ని ఉందనే అంటున్నాడు' అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రేమ, ప్రపోజల్స్ ఎలా ఉంటాయనే కాన్పెప్ట్‌తో రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక ముఖ్యపాత్రలు పోషించారు.  ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement