ఓ సారి బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: ఉప్పెన బ్యూటీ | Krithi Shetty open about he love and break up at movie promotions | Sakshi
Sakshi News home page

Krithi Shetty: నా లవ్‌ బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: కృతి శెట్టి

Apr 7 2026 6:56 PM | Updated on Apr 7 2026 7:04 PM

Krithi Shetty open about he love and break up at movie promotions

ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.

ఎల్‌ఐకే రిలీజ్‌ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉ‍న్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్‌ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్‌ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement