యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్ | Pradeep Ranganathan LIK Movie Trailer | Sakshi
Sakshi News home page

Lik Trailer: ప్యూచరిస్టిక్ లవ్ స్టోరీ.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ చూశారా?

Apr 4 2026 7:55 PM | Updated on Apr 4 2026 8:44 PM

Pradeep Ranganathan LIK Movie Trailer

డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)

ట్రైలర్ బట్టి చూస్తే సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్‌ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్‌లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్‌ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్‌తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్‌లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement