ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్ | Mohanlal And Mammootty Patriot Movie Trailer | Sakshi
Sakshi News home page

Patriot Trailer: సరికొత్త స్పై థ్రిల్లర్.. ఆకట్టుకునేలా ట్రైలర్

Apr 4 2026 6:27 PM | Updated on Apr 4 2026 6:58 PM

Mohanlal And Mammootty Patriot Movie Trailer

మలయాళ సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తదితరుల పేర్లు గుర్తొస్తాయి. వీళ్ల మూవీస్ ఎప్పటికప్పుడు డబ్బింగ్‌ల రూపంలో పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ముగ్గురితోపాటు నయనతార, రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటించిన మూవీ 'పేట్రియాట్' మరో నెల రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?)

స్పై థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సరికొత్త థ్రిల్లర్ చూడబోతున్నామనేలా అనిపించింది. యాక్టింగ్ గానీ సీన్స్ గానీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉన్నాయి. మే 01న పాన్ ఇండియా రేంజులో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికి మలయాళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా తీసుకురానున్నారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement