బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు? | Biker And Rakasa Movie Day 1 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Biker vs Rakasa Collection: లేటెస్ట్ తెలుగు మూవీస్.. కలెక్షన్స్ ఎంత?

Apr 4 2026 2:52 PM | Updated on Apr 4 2026 3:53 PM

Biker And Rakasa Movie Day 1 Collection Worldwide

ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

'రాకాస' విషయానికొస్తే.. మెగాడాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించగా, సంగీత్ శోభన్-నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. మానస శర్మ అనే మహిళా దర్శకురాలు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది.  రిలీజ్ శుక్రవారమే అయినప్పటికీ ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేశారు. వాటితో కలిపి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కావొచ్చేమో అనిపిస్తుంది.

'బైకర్' విషయానికొస్తే.. శర్వానంద్ హీరోగా నటించిన మోటో రేసింగ్ డ్రామా మూవీ ఇది. ఒకప్పటి హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యువీ క్రియేషన్స్ నిర్మించింది. రేసింగ్ సీన్స్ బాగున్నప్పటికీ ఎమోషన్స్ అనుకున్నంత వర్కౌట్ కాలేదని టాక్ అయితే వచ్చింది. దీని తొలిరోజు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్లతో కలిసి మొదటిరోజు రూ.2.41 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. చూస్తుంటే ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ కాస్త ఊపిరి పీల్చుకునేలా కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ‘బైకర్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement