నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్‌ ఏంటి? | Love Insurance Kompany Movie Talk, Twitter Review | Sakshi
Sakshi News home page

LIK Twitter Review: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్‌ ఏంటి?

Apr 10 2026 4:34 PM | Updated on Apr 10 2026 4:59 PM

Love Insurance Kompany Movie Talk, Twitter Review

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్‌ బాగున్నా.. తెరపై  ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్‌ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.

కథ విషయానికొస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన ‘లవ్‌ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్‌ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్‌, సోషల్‌ మీడియా ప్రభావం మన జీవితాలపై  ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్‌. 

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు  చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement