ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Pradeep Ranganathan Love Insurance Kompany OTT Release Date Out Now | Sakshi
Sakshi News home page

Love Insurance Kompany: ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

May 1 2026 3:08 PM | Updated on May 1 2026 3:27 PM

Pradeep Ranganathan Love Insurance Kompany OTT Release Date Out Now

డ్యూడ్‌, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement