రోబోగా అనిరుధ్.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గ్లింప్స్ | Love Insurance Company Glimpse: Pradeep Ranganathan’s Futuristic Love Story Directed by Vignesh Shivan | Sakshi
Sakshi News home page

2040లో జరిగే స్టోరీ.. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా గ్లింప్స్

Aug 27 2025 12:52 PM | Updated on Aug 27 2025 1:14 PM

Love Insurance Kompany Movie Glimpse Telugu

తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నయనతార నిర్మిస్తుండగా ఈమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. టైటిల్ విషయమై అప్పట్లో కాస్త కాంట్రవర్సీ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ పంచ్ పేరుతో ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటూనే ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)

2040లో చెన్నైలో జరిగే స్టోరీతో ఈ సినిమా తీశారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమైపోయింది. ఎస్జే సూర్య విలన్. సంగీతమందించిన అనిరుధ్.. ఇదే మూవీలో కనిపించిన రోబోకు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలానే సినిమాలో యష్.. మిషన్ ఇంపాజిబుల్-14లో నటించాడని, రజినీకాంత్ 189 కూడా చేస్తున్నాడని లాంటి రిఫరెన్సులు ఉన్నాయి. అలానే కొండపై హాలీవుడ్ అక్షరాలు ఉన్నట్లు ఇక్కడ కోలీవుడ్ అని ఉండటం లాంటివి డిఫరెంట్‌గా అనిపించాయి.

2040లో స్వచ్ఛమైన ప్రేమని వెతికే ఓ అమ్మాయి.. హీరోని కలిస్తే తర్వాత ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు ఉంది. ఇందులో ఎస్జే సూర్య గెటప్ కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ప్రస్తుతానికి తమిళ గ్లిం‍ప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా తీసుకొస్తారేమో చూడాలి.

(ఇదీ చదవండి: ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement