ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడో రోజులైనా అంతేనా? | Ram Pothineni Andhra King Taluka Three Days Box Office Collections | Sakshi
Sakshi News home page

Andhra King Taluka Collections: ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Nov 30 2025 4:47 PM | Updated on Nov 30 2025 5:11 PM

Ram Pothineni Andhra King Taluka Three Days Box Office Collections

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న సినిమా నవంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్డ్టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్ను దాటేసింది.

అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్కాలేకపోయాడు. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement