
ప్రముఖ నటీనటులు.. ఇల్లు, అపార్ట్‌మెంట్ లాంటివి కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటివి బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తెలియని వాళ్లకు ఇచ్చేందుకు హిందీ సెలబ్రిటీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో తోటి యాక్టర్స్‌కి అద్దెకు ఇస్తుంటారు. దీని ద్వారా మంచి మొత్తమే అందుకుంటూ ఉంటారు. కానీ 'వార్ 2'తో రీసెంట్‌గా వచ్చిన హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలికి తన ఫ్లాట్ రెంట్‌కి ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.
(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)
క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో చాన్నాళ్ల క్రితమే తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్.. చాలా గ్యాప్ తర్వాత 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ ఇందులో మరో హీరోగా నటించడం విశేషం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. సరే ఈ సంగతి పక్కనబెడితే గతంలో సుస్సానే ఖాన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న హృతిక్.. కొన్నేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నటి షబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.
హృతిక్ ప్రస్తుతం షబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఫ్లాట్‌ని హృతిక్.. తన ప్రియురాలికే అద్దెకిచ్చాడు. ఇందుకుగానూ నెలకు రూ.75 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా మార్కెట్‌లో లక్షల్లో అద్దె ఉంటే.. ప్రియురాలికి మాత్రం తక్కువ ధరకే ఇచ్చేశాడట. అంటే డిస్కౌంట్ అనమాట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్)