
టాలీవుడ్‌లో స్టార్స్ వ్యక్తిగత విషయాల్ని ఆచితూచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. బాలీవుడ్‌లో స్టార్స్.. ఇల్లు లేదా కారు లాంటివి కొన్న వెంటనే ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు కమ్ దక్షిణాది చిత్రాల్లో విలన్‌గా చేస్తున్న సంజయ్ దత్ ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇంతకీ ఆ కారు సంగతేంటి? దాని రేటు ఎంత?
(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)
అప్పట్లో హీరోగా ఎన్నో హిందీ సినిమాలు చేసిన సంజయ్ దత్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైంలో అయితే కేజీఎఫ్ 2, లియో, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. కాకపోతే వీటిలో 'కేజీఎఫ్' సీక్వెల్‌లో ఈయన చేసిన పాత్ర బాగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం హిందీలో పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సంజయ్ దత్ ఇప్పుడు మెర్సిడెజ్ కంపెనీకి చెందిన మేబాచ్ జీఎల్ఎస్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్‌లో దీని ధర రూ.4 కోట్ల వరకు ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)
