‘‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏంజెట్, అఖండ 2’.. ఇలా నా కెరీర్‌లో నటిగా నేను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలే చేస్తున్నాను. భవిష్యత్‌లో బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవల హిందీలో ‘హక్’ (యామీ గౌతమ్ నటించారు) అనే సినిమా చూశాను. కొన్ని సన్నివేశాలకు భావోద్వేగానికి గురై ఏడ్చాను.
ఈ తరహా పాత్రలూ చేయాలని ఉంది’’ అని చెప్పారు హీరోయిన్స్ సంయుక్త. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో దియా అనే పాత్రలో నటించాను.
తోటియాక్టర్స్‌తో పోలిక పెట్టుకోను. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నాతో నేను పోటీ పడుతుంటాను. శర్వాగారి నుంచి మంచి కామిక్ టైమ్‌ను నేర్చుకున్నాను. సాక్షితో మంచి అనుబంధం ఏర్పడింది. రామ్‌గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్. అనిల్‌గారు ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్. పూరి జగన్నాథ్–విజయ్ సేతుపతిగార్ల సినిమాలో నటించాను. నేను మెయిన్స్ లీడ్‌లో ‘ది బ్లాక్‌గోల్డ్’ మూవీ చేస్తున్నాను’’ అని తెలిపారు.


