
ఓటీటీలోకి మరో హిట్ సినిమా వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే డిజిటల్ రిలీజ్ చేశారు. దీంతో చాలామంది తెలుగు ఆడియెన్స్.. మన భాషలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వినాయక చవితి కానుకగా తెలుగు, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
కమెడియన్ నుంచి హీరోగా మారిన తమిళ నటుడు సూరి.. ఈ ఏడాది 'మామన్' అనే సినిమా చేశాడు. మే నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష‍్మి హీరోయిన్. కుటుంబ బంధాల్ని, మేనమామ రిలేషన్ గొప్పదనాన్ని చూపించిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఆగస్టు తొలివారం రిలీజ్ చేశారు. అయితే అప్పుడు తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!)
ఇప్పుడు తెలుగు, కన్నడ డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అక్కా తమ్ముడు బంధాన్ని చాలా ఎమోషనల్‌గా ఈ చిత్రంలో చూపించారు. అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా మూవీని తెరకెక్కించారు. తెలుగు, కన్నడ కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఓ లుక్కేయండి.
'మామన్' విషయానికొస్తే.. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముడు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకునేంతలా. అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. అదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)
