breaking news
Hritik Roshan
-
ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో
ప్రముఖ నటీనటులు.. ఇల్లు, అపార్ట్మెంట్ లాంటివి కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తెలియని వాళ్లకు ఇచ్చేందుకు హిందీ సెలబ్రిటీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో తోటి యాక్టర్స్‌కి అద్దెకు ఇస్తుంటారు. దీని ద్వారా మంచి మొత్తమే అందుకుంటూ ఉంటారు. కానీ 'వార్ 2'తో రీసెంట్గా వచ్చిన హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలికి తన ఫ్లాట్ రెంట్‌కి ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో చాన్నాళ్ల క్రితమే తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్.. చాలా గ్యాప్ తర్వాత 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ ఇందులో మరో హీరోగా నటించడం విశేషం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. సరే ఈ సంగతి పక్కనబెడితే గతంలో సుస్సానే ఖాన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న హృతిక్.. కొన్నేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నటి షబా ఆజాద్‌తో రిలేషన్లో ఉన్నాడు.హృతిక్ ప్రస్తుతం షబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఫ్లాట్‌ని హృతిక్.. తన ప్రియురాలికే అద్దెకిచ్చాడు. ఇందుకుగానూ నెలకు రూ.75 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా మార్కెట్లో లక్షల్లో అద్దె ఉంటే.. ప్రియురాలికి మాత్రం తక్కువ ధరకే ఇచ్చేశాడట. అంటే డిస్కౌంట్ అనమాట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్) -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్‌కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘వార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్,హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ & మైనస్ పాయింట్స్ ఏంటి తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025 -
మరికొన్ని గంటల్లో ‘వార్ 2’ రిలీజ్.. హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు కలిసి నటించిన వార్ 2 చిత్రం మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండడంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు.‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి. స్పాయిలర్లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి’ అని ఎన్టీఆర్ తెలిపారు. -
సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ
ఎన్టీఆర్ చేసిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటించాడు. ఈ గురవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. అదే రోజున రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' కూడా రిలీజ్ కానుంది. అయితే రజినీ మూవీతో పోలిస్తే 'వార్ 2'కి కాస్త హైప్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు దాన్ని పెంచేలా నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులోనే నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)'సినిమా చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. చాలా బాగా వచ్చింది. చూసిన తర్వాత ఏ మాత్రం అసంతృప్తిగా అనిపించినా నన్ను పదింతలు తిట్టండి. నన్ను తిట్టడం మీకు అలవాటే కదా. అది అద్భుతమైన చిత్రం అని మీకు అనిపించకపోతే మళ్లీ ఎప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను. తొలిరోజు హిందీ నెట్ వసూళ్ల కంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలి. ఇప్పటివరకు తారక్ అన్న మనం కాలర్ ఎగరేసేలా చేశారు. ఈసారి మనం అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చెయ్యాలి' అని చెప్పుకొచ్చాడు.యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 సినిమా.. ఈ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లో భాగం. తొలి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించగా.. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని నాగవంశీకి చెందిన సితార ఎంటర్ టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకేనేమో నాగవంశీ ఈ రేంజులో తారక్, వార్ 2 చిత్రానికి ఎలివేషన్లు ఇస్తున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్‌ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్‌ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్‌బస్టర్ వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
భారీ బడ్జెట్‌తో షారుక్- సల్మాన్ సినిమా.. గెస్ట్ రోల్స్‌లో ఎన్టీఆర్, హృతిక్!
వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూని వర్స్‌లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్’ (2012), ‘టైగర్ జిందా హై’ (2017), ‘టైగర్ 3’ (2023), హృతిక్ రోషన్ ‘వార్’ (2019), షారుక్ ఖాన్ ‘పఠాన్’ (2023) వంటి సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ యూనివర్స్‌లోనే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోలుగా చేసిన ‘వార్ 2’, ఆలియా భట్ – శర్వారీ లీడ్ రోల్స్ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్నాయి. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమాలో ఈ యూనివర్స్‌లో భాగమైన హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రం ఆగిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై ‘పఠాన్–టైగర్’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్‌లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హృతిక్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్‌ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
జా.ఎన్టీయార్, హృతిక్‌ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్‌కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్‌కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్‌నెస్‌కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్‌తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్‌గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్‌లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను సృష్టించింది.–జోథా అక్బర్‌లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్‌హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్‌గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్‌కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్‌ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు. -
సినిమా ఆగిపోయిందన్నారు.. కట్ చేస్తే హీరోనే డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. 2019లో చేసిన వార్ హిట్ అవగా.. తర్వాత చేసిన విక్రమ్ వేదా, ఫైటర్ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి.ప్రస్తుతం హృతిక్.. వార్ 2 మూవీ చేస్తున్నాడు. దీనిపై దక్షిణాదిలో బజ్ ఉంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత క్రిష్ 4ని హృతిక్ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మూవీతో హృతిక్.. దర్శకుడిగా మారబోతున్నాడని ఈ హీరో తండ్రి రాకేశ్ రోషన్ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు.క్రిష్ ఫ్రాంచైజీలో ఇదివరకే మూడు సినిమాలు వచ్చాయి. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 ఇప్పటికే రిలీజయ్యాయి. మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి త్వరలో క్రిష్ 4 తీయబోతున్నారు, అది కూడా హృతిక్ డైరెక్టర్ అంటే ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) View this post on Instagram A post shared by Rakesh Roshan (@rakesh_roshan9) -
ప్రియురాలికి హృతిక్ రోషన్ విషెస్ .. పెళ్లి అయిపోయిందా?
బాలీవుడ్ సెలబ్రిటీ ప్రేమ జంటల్లో హృతిక్ రోషన్- సబా ఆజాద్ ఒకరు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఈవెంట్ జరిగినా జంటగా కనిపిస్తారు. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటూ బీటౌన్‌లో టాక్ వినిపించింది. కానీ అలాంటిదేం జరగలేదు.అయితే తాజాగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాపీ యానివర్సిరీ పార్ట్నర్ అంటూ సబా ఆజాద్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే అయితే తన ప్రియురాలిని హృతిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పోస్ట్‌తో గతేడాది అక్టోబర్‌లోనే వీరి పెళ్లి జరిగినట్లు హృతిక్ హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ జంట తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఎలాంటి హడావుడి లేకుండానే హృతిక్- సబా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా.. గతంలో సబా ఆజాద్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. 'క్రిష్', 'కోయి మిల్ గయా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరో హృతిక్ రోషన్. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్న ఇతడు.. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీని తర్వాత సుస్సానే మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండగా.. హృతిక్ కూడా షబా అనే యువ నటితో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి విషయం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే హృతిక్ రోషన్ చివరిసారిగా యాక్షన్ చిత్రం ఫైటర్‌లో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ వార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. సబా ఆజాద్ చివరగా అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో.. హింట్ ఇచ్చేశాడా?
స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లికి రెడీ అయిపోయాడా? అంటే అవుననే అనిపిస్తోంది. మొదటి భార్య నుంచి ఇదివరకే విడాకులు తీసుకున్న ఈ హీరో.. యంగ్ బ్యూటీ షబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు కూడా. మాజీ భార్య, ప్రియురాలితో కలిసి హృతిక్ పలుమార్లు కనిపించాడు. అలాంటిది త్వరలో హృతిక్.. పెళ్లి విషయంలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)'క్రిష్', 'కోయి మిల్ గయా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమున్న హృతిక్ రోషన్.. ఆ తర్వాత కాలంలోనూ పలు చిత్రాలతో మనకు అలావాటయ్యాడు. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్న ఇతడు.. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీని తర్వాత సుస్సానే మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండగా, హృతిక్ కూడా షబా అనే యువ నటితో ప్రేమలో పడ్డారు. వీళ్లిద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.కొన్నేళ్లుగా హృతిక్-షబా బంధం గురించి అందరికీ తెలుసు. కాకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచేశారు. తాజాగా షబా ఇన్ స్టాలో 'రివీలింగ్ సూన్' (త్వరలో బయటపెడతా) అని ఓ పోస్ట్ పెట్టగా.. 'ఆగలేకపోతున్నాను' అని హృతిక్ కామెంట్ పెట్టాడు. ఇది పెళ్లి విషయమేనా అనే సందేహం వస్తోంది. మరోవైపు ఏదైనా మూవీ ప్రమోషనా అని డౌట్ కూడా వస్తోంది. ఇది ఏంటనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: వెకేషన్లో ఐకాన్ స్టార్.. బన్నీ- సుకుమార్ మధ్య అసలేం జరుగుతోంది?) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
హీరో ఇంటిని రెంట్‌కు తీసుకోనున్న స్టార్ జంట!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్‌కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌కు మారిపోయారు.దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్‌కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్ అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్‌లో కనిపించనున్నారు. -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్షిప్ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్‌ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. (ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) -
ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ భారీ సినిమా
-
ప్రపంచాన్ని షేక్ చేయబోతున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్
-
కాంతార చూసి చాలా నేర్చుకున్నా..రిషబ్‌పై హృతిక్ ప్రశంసల వర్షం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. రిషబ్ నటన అసాధారణమైందని వర్ణించారు. (ఇది చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కాంతార చిత్రాన్ని ప్రశంసించారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో హృతిక్ రోషన్ మాట్లాడారు. రిషబ్ నమ్మకం అసాధారణమైందని కొనియాడారు. హృతిక్ రోషన్ తన ట్వీట్లో రాస్తూ..'కాంతార చూడటం ద్వారా చాలా నేర్చుకున్నా. రిషబ్ నమ్మకం ఈ చిత్రాన్ని అసాధారణంగా మార్చింది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు గూస్బంప్స్ తెప్పించింది.' అంటూ పోస్ట్ చేశారు. హృతిక్ రోషన్ ట్వీట్‌కు కాంతార హీరో రిషబ్ శెట్టి రిప్లై ఇచ్చారు. ధన్యవాదులు సార్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రం కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో భూత కోలా అనే ప్రాంతీయ ఆచారం కథాంశంగా తెరకెక్కించారు. Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps 🤯 Respect & kudos to the team 👏🏻 — Hrithik Roshan (@iHrithik) December 11, 2022 -
బాలీవుడ్ స్టార్ హీరో చెల్లితో డేటింగ్.. ఆ యంగ్ హీరో ఎవరంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలువలేదు. తాజాగా కార్తిక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ సిస్టర్ పష్మినా రోషన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యంగ్ హీరో కార్తిక్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల భూల్ భూలయ్యా- 2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్లో మరో రెండు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు యంగ్ హీరో కార్తిక్. హృతిక్ బాబాయి, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రాజేశ్ రోషన్ కూతురైన పష్మినాతో కలిసి కార్తిక్ ఇటీవలే ముంబయి రోడ్లపై కనిపించి సందడి చేశారు. అంతే కాదు దీపావళి వేడుకల్లోనూ ఈ జంట ప్రత్యేక వాహనంలో ముంబైలోని జూహూలో డ్రైవ్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు రావడం, రాత్రిళ్లు పార్టీల్లో పాల్గొనడంతో డేటింగ్ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంతవరకు వీటిపై ఈ జంట నోరు స్పందించకపోవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరీ పష్మినాతో బంధమైనా ఎక్కువ కాలం కొనసాగిస్తాడో లేదా వేచి చూడాల్సిందే. -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్‌లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్‌పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
టైటిల్‌తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్‌గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్‌కి బాలీవుడ్ రీమేక్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!
దసరా సెలవుల్లో వినోదం పంచేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. స్కూళ్లు, కాలేజీలకు వరుస హాలీడేస్ రావడంతో థియేటర్లకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి. ధనుష్ నేనే వస్తున్నా: తమిళ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'నానే వరునెన్'. తెలుగులో ఈ సినిమా 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ సినిమాలో ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1: భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో రూపొందించిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 30న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. హృతిక్ రోషన్ మూవీ విక్రమ్ వేద: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా.. సీఎస్ సామ్ సంగీతమందించారు. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు/ వెబ్ సిరీస్‌లు ఇవే: నెట్‌ఫ్లిక్స్ బ్లోండీ సెప్టెంబరు 28 ప్లాన్ ఏ ప్లాన్ బి సెప్టెంబరు 30 జీ5 బుల్లెట్ ట్రైన్ సెప్టెంబరు 29 కెప్టెన్ సెప్టెంబరు 30 సోనీ లివ్ కోబ్రా సెప్టెంబరు 28 అమెజాన్ ప్రైమ్ వీడియో 777 చార్లీ సెప్టెంబరు 30 డిస్నీ+హాట్ స్టార్ కర్మయుద్ధ్ సెప్టెంబరు 30 హాకస్ పోకస్ 2 -
హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను ఆ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో హృతిక్ రోషన్ తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. హృతిక్‌రోషన్ హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. గణేశ్ హెగ్డే కొరియోగ్రాఫి అందించారు. కాగా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విక్రమ్‌వేద చిత్రాన్ని వైనాట్ స్టుడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. -
హృతిక్ రోషన్ యాడ్‌పై జొమాటో క్షమాపణలు
భోపాల్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన మహాకాల్ వాణిజ్య ప్రకటన వివాదం కావడం తెలిసే ఉంటుంది. boycott zomato ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్షమాపణ చెప్పింది. తాము పేర్కొన్న మహాకాల్ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదంటూ వివరణిచ్చింది. ఆ ప్రకటనలో హృతిక్..‘ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్ నుంచే తెప్పించుకుని తింటా’ అని అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉజ్జయిని కలెక్టర్.. మహాకాల్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశిష్ సింగ్ స్పందిస్తూ.. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని, అలాంటిది ఈ యాడ్ వాళ్ల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రకటన ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్ రెస్టారెంట్‌కు మాత్రమే సంబంధించిందని జొమాటో వివరణ ఇచ్చుకుంది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని జొమాటో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మహాకాల్ దైవప్రసాదం.. అవమానిస్తారా? -
జిమ్‌లో డ్యాన్స్ చేసి అలరించిన హృతిక్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సెట్ లేదా జిమ్‌లోనూ ఎక్కువ సేపు సరద సరదాగా గడపడానికే ఇష్టపడతాడు. ఎప్పుడు సోషల్ మాధ్యమాల్లో తన ఆనంద క్షణాలని షేర్ చేస్తుండే హృతిక్ ఈసారి జిమ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేశాడు. అందులో హృతిక్ 1979లో మిస్టర్ నట్వర్లాల్ సినిమాలోని 'పరదేశీయా' అనే పాటకు గుజరాతీ గర్బా డ్యాన్స్‌తో (దాండియా నేపథ్యం) అలరించాడు. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) ఆ తర్వాత నవరాత్రి కదా అందుకే ఈ డ్యాన్స్ అంటూ చెబుతాడు. అయితే 80 నిమిషాల నిడివిగల ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఈ వీడియోలో ఆధ్యంతం హృతిక్ డ్యాన్స్‌తో చక్కగా అలరించాడు. ఈ క్రమంలో హృతిక్ సహ నటి దీపికా పదుకొనే హృతిక మంచి హస్యగాడు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఇతర నటులు రణవీర్ సింగ్, ప్రీతి జింటా, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్ మరియు వరుణ్ ధావన్ ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం హృతిక్, దీపికా పదుకునే జంటగా 'ఫైటర్' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) -
హృతిక్ రోషన్ పక్కన నటించడం నా కల: నటి
నికిత దత్తా.. సంప్రదాయ వ్యాయామాన్నే కాదు నటననూ ఒక యోగంగా మలచుకుంది. ప్రేక్షకుల ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్ స్క్రీన్ అప్పియరెన్స్ మీదా శ్రద్ధ పెడుతున్న ఆమె గురించే ఈ పరిచయం... పుట్టింది ఢిల్లీలో. తండ్రి అనిల్ దత్తా నేవీ ఆఫీసర్ అవడం వల్ల అతని ఉద్యోగరీత్యా విశాఖపట్టణం, కొచ్చి, ముంబైల్లో నికిత బాల్యం, విద్యాభ్యాసం గడిచాయి. ఆరేళ్ల వయసులో హృతిక్ రోషన్‌కు అభిమానిగా మారింది. ఆ ఇష్టంతోనే నటి కావాలని నిర్ణయించుకుంది. స్వతంత్ర జీవన శైలిని అనుసరిస్తుంది. కాలేజీ రోజుల్లోనే గోవా టూర్ కోసం ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసి అయిదు వేల రూపాయలు ఆర్జించింది. అదే ఆమె తొలి సంపాదన. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది కూడా అప్పుడే. 2012లో ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. జూమ్ చానెల్లో ప్రసారమయ్యే ‘మ్యూజిక్ రిక్వెస్ట్’ షోతో బుల్లితెరకు పరిచయమైంది. 2014లో ‘లేకర్ హమ్ దివానా దిల్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా యాడ్స్, షోస్‌తో ఆమె బిజీగానే ఉంది. 2014 టీ20, వరల్డ్ కప్ గేమ్స్‌కు స్టార్‌స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. 2015లో చేసిన ‘డ్రీమ్ గర్ల్’ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దాంతో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పక్కన ‘గోల్డ్’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. సూపర్ డూపర్ హిట్ ‘కబీర్ సింగ్’లోనూ చేసింది. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రసారమవుతోన్న ‘ఆమ్ఫట్’తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘మస్కా’తో అలరిస్తోంది నికిత. అందమైన హ్యాండ్ బ్యాగ్స్, షూ, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ను సేకరించడం, డాన్స్, యోగా ఆమె అభిరుచులు, క్రమం తప్పని అలవాట్లు. 'వ్యాయామంతోనే నా రోజు మొదలవుతుంది. కొంతకాలం యోగా గురువుగా కూడా పనిచేశా. ఎప్పటికైనా ఓ పెద్ద యోగా ఆశ్రమం నిర్మించడమే నా లక్ష్యం. హృతిక్ రోషన్ పక్కన నటించడం నా కల' – నికిత దత్తా చదవండి: బిపాసా బసు - జాన్ అబ్రహాంల విఫల ప్రేమ కథ -
మహేశ్ సినిమాలో హృతిక్ రోషన్!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేశ్‌బాబు, హృతిక్ రోషన్ స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరూ స్క్రీన్న్ షేర్ చేసుకుంటే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే. ఆ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మహేశ్, హృతిక్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఇప్పుడు బీ టౌన్లో బలంగా వినిపిస్తోంది. రామాయణం ఆధారంగా ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ సంయుక్త దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రకటన వచ్చింది. అప్పటి ప్రకటన ప్రకారం ఈ త్రీడీ రామాయణానికి అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన నిర్మాతలు. ఏడాది క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్ష¯Œ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్స్ పెద్దగా తెరపైకి రాలేదు. రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను ఎనౌన్స్ చేయడమే ఇందుకు కారణం అనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదని.. నితీష్, రవి ఉడయార్ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తూనే ఉన్నారని... ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారని బీ టౌన్లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ సినిమాలోని రాముడి పాత్రకు మహేశ్‌బాబును, రావణుడి పాత్రకు హృతిక్ రోషన్‌ను సంప్రదించారట దర్శకుడు నితీష్. మరి... మహేశ్, హృతిక్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వెయిట్ అండ్ సీ. చదవండి: అక్షయ్ కుమార్ క్షేమంగా ఉన్నారు : ట్వింకిల్ ఖన్నా కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్.. -
గుర్తుపట్టారా? ఆ బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లేటెస్ట్గా ఓ పాత ఫొటోను షేర్ చేశారు. అందులో ఆయన మొట్టమొదటిసారిగా 'మిస్టర్ నట్వర్లాల్' చిత్రంలో పాట పాడేందుకు సిద్ధమవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ అమితాబ్ సరిగా పాడగులుగుతున్నాడా? లేదా? అన్నట్లుగా నిశితంగా పరిశీలిస్తున్నారు. బిగ్‌బీ మాత్రం తన ఫోకస్ అంతా లిరిక్స్ మీద పెట్టినట్లు కనిపిస్తున్నారు. అంత తీక్షణంగా చూస్తుంది ఎవరు? అయితే అమితాబ్ తొలిసారి పాడుతున్నందుకో, లేదా? అక్కడేం జరుగుతుందో అర్థం కాకనో కానీ కుర్చీ మీద కూర్చున్న ఓ బుడ్డోడు మాత్రం నోరు తెరిచి అమితాబ్‌నే చూస్తున్నాడు. ఇంతకీ అతడెవరునుకుంటున్నారు.. ఆలిండియా అందగాడు హృతిక్ రోషనే. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన పోస్టు ద్వారా వెల్లడించారు. 'తొలిసారిగా నేను మిస్టర్ నట్వర్లాల్ సినిమాలో 'మేరే పాస్ ఆవో మేరీ దోస్త్' పాట పాడాను. ఈ రిహార్సల్స్ అక్కడ బెంచీ మీద కూర్చున్న హృతిక్ రోషన్ పర్యవేక్షణలో జరిగాయి' అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు. మిస్టర్ నట్వర్లాల్ సినిమా విషయానికొస్తే అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రేఖ కథానాయికగా మెరిశారు. అజిత్, కదేర్ ఖాన్, అంజద్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతాడనుకున్నారు.. కానీ..) కలిసి నటించినవి రెండే.. కాగా ప్రస్తుతం బిగ్‌బీ చేతిలో బ్రహ్మాస్త్ర, ఝండ్ చిత్రాలున్నాయి. అటు హృతిక్ రోషన్.. సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఫైటర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్‌బీ, హృతిక్ కేవలం రెండు సినిమాల్లోనే కలిసి నటించారు. 2001లో వచ్చిన 'కభీ ఖుషీ కభీ ఘమ్'లో అమితాబ్ వ్యాపారవేత్తగా, హృతిక్ ఆయన కొడుకుగా నటించారు. 2004లో వచ్చిన 'లక్ష్య' సినిమాలో వీళ్లిద్దరూ ఆర్మీ జవాన్లుగా నటించారు. ఇందులో బిగ్‌బీ హృతిక్‌కు సీనియర్‌గా దర్శనిమస్తారు. (చదవండి: అదే జరిగితే మెగా అభిమానులకు పండగే) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
వారి కోసం నేను బాధపడను: సూసానే ఖాన్
ముంబై: ‘నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం నేను చింతించను. అలా బాధపడుతూ ఒక్కరోజును కూడా వృథా చేయను’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ పేర్కొన్నారు. అంతేగాక ఇక జీవితంలో ఇక వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ నిలిరంగు కోటుతో ఫార్మల్ వేర్ ధరించిన తన ఫొటోను ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్‌లా కనిపించారు. అయితే ఆమెకు స్వయంగా ఇంటిరియల్ డిజైనింగ్ లెబుల్ దీ చార్కోల్ ప్రాజెక్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బిజినెస్‌కు దూరమయ్యారు. తాజాగా సుసానే తిరిగి తన బిజినెస్‌పై దృష్టి పెట్టారు. (చదవండి: అందుకే హృతిక్ ఇంటికి వెళ్లాను: సుసానే ఖాన్) ఈ నేపథ్యంలో తను స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్‌గా పేర్కొంటూ ఈ తాజాగా ఈ ఫొటోను షేర్ చేసినట్లను తెలుస్తోంది. సుపానే పోస్టుకు హృతీక్ స్పందిస్తూ ‘సూపర్ పిక్ అంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి సుసానె ‘లుక్ అవే లుక్ కోసం ప్రయత్నించాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. అయితే హృతిక్, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల 2014లో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా నేపథ్యంలో అమలైన లాక్డౌన్లో వీరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ ఇద్దరూ పిల్లలు హ్రేహాన్, హ్రిధాన్ల కోరిక మేరకు తాత్కాలికంగా తాము ఒకే ఇంట్లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. View this post on Instagram If you leave I won’t cry... I won’t waste a single day.. 🦋😊#neverlookback #eaglesnestwarmth A post shared by Sussanne Khan (@suzkr) on Sep 15, 2020 at 9:47am PDT -
హృతిక్ సిగరెట్ తాగుతున్నాడా?
ఈ ఫొటోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కొడుకు ముందే సిగరెట్ కాల్చుతున్నాడా? లేదూ, కొడుకులతో కలిసి సిగరెట్ తాగుతున్నాడా? లేకపోతే అక్కడ సిగరెట్ ఉన్నట్టు మనమే పొరపడుతున్నామా? ఇలా రకరకాల అనుమానాలతో అతని అభిమానుల బుర్ర వేడెక్కిపోయింది. దీంతో ఉండబట్టలేక హృతిక్‌నే అడిగేశారు. దానికి హీరో బదులిస్తూ తనకు ధూమపానం అలవాటు లేదని స్పష్టం చేశాడు. నేను క్రిష్(అద్భుత శక్తులున్న పాత్ర) అయితే మొట్ట మొదట ప్రస్తుత వైరస్‌ను నిర్మూలించి, వెంటనే ఈ భూగ్రహం మీద నుంచి ఆఖరి సిగరెట్ వరకు అన్నింటినీ నాశనం చేస్తానని పేర్కొన్నాడు. (లాక్డౌన్: కరీనాకు సలహా ఇచ్చిన అర్జున్ కపూర్) తన ప్రశ్నకు బదులు వస్తుందని ఊహించని అభిమాని అనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే హృతిక్ సిగరెట్ తాగడని తనకు తెలుసని, కానీ ఎంతో మంది ఈ ఫొటో చూసి హీరో ధూమపానం చేస్తాడేమోనని భ్రమపడుతున్నారని పేర్కొన్నాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మిగతా అభిమానులు సైతం సిగరెట్ అలవాటు లేని హృతిక్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. "నీకు ఎలాంటి శక్తులున్నా లేకపోయినా నువ్వు మాకు క్రిష్వే.." అంటూ కామెంట్లతో ప్రేమను చాటుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫొటోను హృతిక్ రోషన్ మాజీ భార్య సుశానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు) -
‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారితో ఎలా పోరాడారో, దానిని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు. ‘ఇదంతా ఎలా జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నొప్పి లేదు, దురద లేదు.. ఇది చాలా చిన్న విషయం అనుకున్నాను. ఓ రోజు ముంబైలోని హిందూజ హాస్పిటల్‌కు నా స్నేహితుడిని కలవడానికి వెళ్లినప్పుడు.. తనతో మాట్లాడుకుంటూ అక్కడి ఆవరణంలో నడుస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఈఎన్టీ సర్జన్ బోర్డు చూసి డాక్టర్ క్యాబిన్‌కు వెళ్లాను. ఆ డాక్టర్ నన్ను పరీక్షించి ‘బయాప్సీ’ పరీక్ష చేయించుకొమని సలహా ఇచ్చారు. డాక్టర్ ఎందుకు ఆ పరీక్ష చేయించుకొమ్మన్నారో నాకు తెలియదు కానీ.. నేను కాన్సర్ బారిన పడిన సంగతి నాకు కొంత అర్ధమైంది. ఆ తర్వాత నేను హృతిక్ రోషన్(నా తనయుడు) వద్ద ఉన్న సమయంలో(15 డిసెంబర్2018 ) రోజున పరీక్షలో బయాప్పీ పాజిటివ్ వచ్చిందని ఫోన్ వచ్చింది’ అని పేర్కొన్నారు. View this post on Instagram I have always been a student of Life. The burning desire in me to learn, is as blazing as a toddler. But before I could understand and interpret my many life lessons, it was my Father who taught me. Thank you Papa, for teaching me things that no education institution, no acting classes, no book could. for making me understand and not only see, for pushing me to think before I act. You make me be a better human, father, son, actor and friend. Thank you for being an example, it is upto you I look, when my children look for their dad. Happy Teacher's day A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Sep 5, 2019 at 7:30am PDT అలాగే తన కుటుంబం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఈ విషయం వారిని కదిలించలేదని రాకేష్ రోషన్ పేర్కొన్నారు. కాగా ‘కాన్సర్ చికత్సలో భాగంగా నా నాలుకను కత్తిరించాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పినప్పుడు నేను కాస్త భయపడి మొదట నిరాకరించాను. ఆ తర్వాత కాన్సర్ కణాలు ఉన్న నా నాలుక భాగాన్ని కత్తిరించారు. ఆ తర్వాత మూడు నెలల పాటు నీళ్లు, టీ, కాఫీలాంటివి తాగలేక పోయాను. కొన్నిసార్లు నాలుకలోని రుచి కణాలు కూడా సరిగా పని చేయక వివిధ రుచులను ఇచ్చేవి. ఈ మూడు నెలల్లో నేను దాదాపు 10 కిలోల బరువు తగ్గాను, అయితే మళ్లీ 3 కేజీ బరువు పెరిగాను. ఇప్పుడు రోజు 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నా. పూర్తి ఆరోగ్యవంతంగా మారటానికి మరో ఆరు నెలల సమయం పడుతుందేమో’ అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram #personalised napkins too#love from your children is irreplaceable #glimpse of my surprise#liveyourbestlife # A post shared by Pinkie Roshan (@pinkieroshan) on Oct 22, 2019 at 1:20pm PDT -
‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’
పట్నా : ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధం అవుతోన్న వారికి బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేందుకు తోడ్పడుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆనంద్ కుమార్. ఈ ఐఐటీ ట్యూటర్ జీవిత చరిత్ర ఆధారంగా... బాలీవుడ్లో ‘సూపర్ 30’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది. ఆనంద్ కుమార్ కృషి గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాక ‘ఆనంద్ చేస్తోన్న పని గురించి తెలిసి అతడిని అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం.. ఆనంద్ నా సాయాన్ని తిరస్కరించారు. తన స్వంతంగానే ఈ సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ కుమార్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి’ అంటూ రీట్వీట్ చేశాడు. Anand Kumar says in the article that he turned down my offer to fund his efforts. I confirm that when we met, he courteously declined my offer of financial support. I remain an admirer of how he’s changed the lives of so many. https://t.co/3Gn3V1Qdlp pic.twitter.com/fAFqYg6UtU — anand mahindra (@anandmahindra) July 13, 2019 ఆనంద్ కుమార్ 2002లో ఈ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటారు. మొదటి ఏడాదిలోనే ఈ అకాడమీకి చెందిన 30 మందిలో 18 మంది ఐఐటీకి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2010 లో ఈ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆనంద్ కుమార్ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఫారిన్ మీడియా కూడా ఆనంద్ కుమార్ కృషిని ప్రశంసించింది. -
‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’
బాలీవుడ్లో కంగనా రనౌత్, హృతిక్ రోషన్ల మధ్య వచ్చిన విభేదాల గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు హృతిక్ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు వీరిద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈక్రమంలో కంగన సోదరి రంగోలి సంచలన విషయాలు వెల్లడించారు. హృతిక్ సోదరి సునైనాను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారని.. సాయం కోసం ఆమె కంగనకు ఫోన్ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు రోషన్ కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు రంగోలి. ‘హృతిక్ సోదరి సునైనా ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దాంతో అతన్ని మర్చిపోవాలంటూ సునైనాను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ పోలీసు అధికారిని ఇంటికి పిలిపించి మరి సునైనాకు వార్నింగ్ ఇప్పించారు. ప్రస్తుతం సునైనా పరిస్థితి తల్చుకుంటే చాలా బాధగా ఉంది. తన ఇంట్లోనే ఆమె నరకం అనుభవిస్తున్నారు. సాయం కోసం కంగనకు ఫోన్ చేసింది. అయితే సునైనాకు ఎలా సాయం చేయాలో కంగనకు తెలీడంలేదు. అందుకే ఈ విషయాలన్నీ ట్విటర్ వేదికగా బయటపెడుతున్నాను’ అన్నారు రంగోలి. Sunaina Roshan is asking Kangana for help, her family is physically assaulting her because she is in love with a Muslim man from Delhi, last week they got a lady cop who slapped her, her father also hit her, her brother is trying to put her behind bars..(contd) — Rangoli Chandel (@Rangoli_A) June 19, 2019 అంతేకాక ‘సునైనా భద్రత కూడా మాకు ముఖ్యమే. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ రంగోలి వరుస ట్వీట్స్ చేశారు. గతంలో సునైనాకు, తనకు మంచి స్నేహం ఉందని కంగన వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ మధ్యకాలంలో సునైనాకు తన కుటుంబంతో ఓ విషయంలో గొడవ జరిగింది. దాంతో కంగన హృతిక్ వివాదంలో సునైనా తన సోదరుడు హృతిక్‌దే తప్పంటూ ట్విటర్ వేదికగా కంగనాకు మద్దతు తెలిపారు. I support Kangana all through — Sunaina Roshan (@sunainaRoshan22) June 18, 2019 -
‘నేను ఉన్న చోట.. వారిద్దరు ఉండరు’
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్, హృతిక్ రోషన్‌పై మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్కు హాజరయిన కంగనా.. కరణ్ బంధుప్రీతిని ప్రోత్సాహిస్తారని.. తన గురించి హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం అని అన్నారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘కరణ్ తన షోలో ఉత్తమ నటి లిస్ట్‌లో నా పేరు ప్రకటించలేదు. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన వ్యక్తి అతనికి కనిపించలేదు. కరణ్ లాంటి వారు కొందరి నటుల సామర్థ్యాలను జనాల మనసులో ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయతిస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల నన్ను పట్టించుకోవడం లేదే అని నేను బాధ పడతాననుకుంటే పొరపాటు. వీటన్నింటి వల్ల నేను చాలా బలంగా నిలదొక్కుకోగలిగాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఓ కార్యక్రమంలో కరణ్ జోహార్ నేను ఉద్యోగం లేక తిరుగుతున్నాని హేళన చేశారు. ఉద్యోగం కోసం నేను తన లాంటి వారిని అడుక్కుంటున్నట్లు కరణ్ మాట్లాడాడు. ఒకసారి నా సామర్థ్యాన్ని.. అతని సినిమాలను పరిశీలించండి. విషయం మీకే అర్థం అవుతుంది. ఇలాంటి వారి బుద్ధి వికసించడాని చ్యవన్‌ప్రాశ్ అవసరం’ అన్నారు. ఇక హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది చాలా పాత విషయం. ప్రస్తుతం నేను దీనికంత ప్రాధాన్యత ఇవ్వదల్చుకోవడం లేదు. 1970లో జనాలు బెల్‌బాటమ్ ప్యాంట్లను ఇష్టపడేవారు. ఇప్పుడు తిరిగి చూసుకుంటే.. అరే అప్పుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించామా అనిపిస్తుంది. హృతిక్ రోషన్ అంశం కూడా నాకు ఇలానే తోస్తుంది. రెండు సినిమాల్లో దాదాపు ఐదేళ్ల పాటు నాతో కలిసి పని చేసిన వ్యక్తి నేనవరో తెలియదనడం విచారకరం. ఈ అబద్దం నమ్మేలా ఉందా’ అని కంగనా ప్రశ్నించారు. ఈ వివాదాల్లో ఒక వేళ మీరు కరణ్, హృతిక్ స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి సందర్భమే ఎదురు కాదు.. నేను ఉన్న చోట వారు అసలే ఉండరు అని నవ్వుతూ సమాధానమిచ్చారు కంగనా. (చదవండి : ఆమెకు సారీ చెబుతా!) -
దీపిక నాకు దూరం అవుతుందేమో?
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల మధ్య మాటల తుటాలు మళ్లీ మొదలు కావటంతో.. పాత వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి ఈ-మెయిల్స్ సంభాషణలను కీలక సాక్ష్యాలుగా పోలీసులు విచారణ చేపట్టగా.. తాజాగా వాటిలో దీపిక పదుకొనే పేరు ప్రస్తావనకు రావటం సంచలనంగా మారింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్‌కు చెందిన రిపబ్లిక్ టీవీ ఈ మేరకు ఓ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అందులో దీపిక ప్రవర్తన గురించి కంగనా హృతిక్ వద్ద ప్రస్తావించింది. ‘దీపిక వ్యవహారాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. నా మనసులో దీపికపై మంచి అభిప్రాయం లేదని, ఆమె గత నాలుగు రోజులుగా నాకు ఫోన్ కాల్స్ చేయదు. తన గురించి నాకు తెలిసిపోయినట్టు భావించబట్టే, దీపిక నాకు దూరం అవుతోందని అనుకుంటున్నా' అంటూ కంగానా ఆ మెయిల్స్‌లో ప్రస్తావించిందంట. దీపిక అర్థరహితమైన పనులతో తాను విసుగు చెందినట్టు కంగనా హృతిక్ తో చెప్పుకుంది. ఆమెపై తనకెన్నో సందేహాలున్నాయని, తనకు భయంగా ఉందని, ఏడవాలని ఉందంటూ హృతిక్‌కు చెప్పుకుని బాధపడింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గతంలోనే చాలాసార్లు హృతిక్ కంగనా కోరినట్లు కూడా ప్రస్తావించింది. మొత్తానికి వీరిద్దరి మధ్య వ్యవహారంలోకి మరో అగ్ర హీరోయిన్ పేరు రావటం బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. దీనిపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
హృతిక్ Vs డికాప్రియో
ఇద్దరు అల్టిమేట్ సూపర్ స్టార్లలో ఎవరి నటన బాగుంటుందో తేల్చి చెప్పే వీలుంటుందా? ఎందుకుండదు.. ఆ ఇద్దరూ ఒకరి సినిమాలు మరొకరు రీమేక్ చేస్తే నటనలో ఎవరెంత ఘనాపాటో ఈజీగా చెప్పేయొచ్చని అంటారేమో! నిజమే.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 'యాంగ్రీ యంగ్‌మ్యాన్' అనే బిరుదుతోపాటు సూపర్ స్టార్ హోదానూ తెచ్చిపెట్టిన 'అగ్నిపథ్' సినిమా రీమేక్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించినప్పుడూ ఇలాంటి చర్చే జరిగింది. అఫ్ కోర్స్ 'అమిత్ జీకి నాకూ పోలికా? ఆయన ఆకాశమైతే నేను నేల' అని హృతిక్ రోషన్ స్వయంగా మీడియాతో అన్నాడు. ఆ సినిమా ఫలితాన్ని పక్కనపెడితే హృతిక్ తాజాగా మరో రీమేక్ కు పచ్చజండా ఊపాడు. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన 'ది డిపార్టెడ్' సినిమా రీమేక్ లో హృతిక్ నటించనున్నాడు. 2004లో నాలుగు అకాడమీ అవార్డుల్ని గెల్చుకున్న ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నదియావాలా నిర్మాతగా వ్యవహరిస్తారు. తర్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న డిపార్టెడ్ రీమేక్ వివరాలు తర్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. నిజానికి డిపార్టెడ్ సినిమా కూడా 'ఇన్ఫెర్నల్ అఫైర్స్' అనే హాంకాంగ్ సినిమాకు రీమేకే. తెలుగులో 'హోమం' పేరుతో జేడీ చక్రవర్తి, జగపతిబాబు నటించిన సినిమా 'ది డిపార్టెడ్'కు నకలే! -
సచిన్ చివరి మ్యాచ్ కు ప్రముఖుల సందడి
కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న సచిన్ ను చూసేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున్న వాంఖెడే స్టేడియానికి వచ్చారు. చివరి మ్యాచ్ లో సచిన్ ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్, అజిత్ వాడేకర్, హృతిక్ రోషన్, పూనమ్ పాండే, వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడి, శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. సెక్సీ స్టార్ పూనమ్ పాండే తన చేతిపై సచిన్ టాటూ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.