
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్‌కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ.