బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో చివరి కెప్టెన్సీ జరుగుతోంది. దీనికోసం రీతూ, సంజన, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, దివ్య పోటీపడుతున్నారు. రేసులో లేని ముగ్గురు భరణి, సుమన్, రీతూ వీళ్ల కోసం ఆడాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా డాగర్ తీసుకుంటారో.. తాము కెప్టెన్‌గా చూడాలనుకునే వ్యక్తికి ఆ డాగర్ ఇవ్వాలి.
సంజనను తప్పించిన రీతూ
అలా ముందుగా సుమన్.. రీతూకి డాగర్ ఇచ్చాడు. గేమ్ గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేస్తున్నావంటూ సంజనను రేసు నుంచి తీసేసింది రీతూ. నీ గేమ్ ఏముంది?పొద్దున్నే లేచి నువ్వా మూలను, అతడు ఇంకో మూలకు పోతాడు. కాసేపటికి ఇద్దరూ ప్యాచప్ అవుతారు అని చెప్పింది. అవును, నేను రియల్‌గా, జెన్యూన్‌గా ఉన్నాను అంది రీతూ. ఇక సంజనా కోసం జుట్టు త్యాగం చేసి తప్పు చేశానని బాధపడింది.
మండిపడ్డ ఇమ్మూ
తర్వాత భరణి.. పవన్‌కు డాగర్ ఇచ్చాడు. అతడు ఇమ్మాన్యుయేల్‌ను రేసు నుంచి తీసేశాడు. అది ఇమ్మూ తీసుకోలేకపోయాడు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది.. ఇలాంటివి వద్దు.. అంటూ వేలు చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఈ గేమ్‌లో డిమాన్ పవన్ కెప్టెన్ అయినట్లు తొలుత లీక్స్ బయటకు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది.
చివరి కెప్టెన్‌గా కల్యాణ్
ఈ గేమ్‌లో చివరగా పవన్, కల్యాణ్ మిగిలారట. వీరిద్దరికీ పెట్టిన గేమ్‌లో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఫైర్ స్ట్రామ్ వచ్చినప్పుడు కల్యాణ్ ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సీజన్‌లో చివరగా మరోసారి కెప్టెన్ అయ్యాడు. ఇది ఫ్యాన్స్ మంచి కిక్కిచ్చే వార్తే అవుతుంది!


