ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోరుతోంది. భర్త, ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. అతడి వల్ల కోల్పోయిన రూ.50 కోట్లు తిరిగిప్పించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు యూఏఈలో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు, మాజీ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని తిరిగి తీసుకురావడం కోసం పోరాడుతోంది.
ఒంటరి పోరాటం
ఈ క్రమంలో సెలీనా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. నా జీవితాన్ని అల్లకల్లోలం చేసే తుపాను ఒకటి వస్తుందని.. అప్పుడు పేరెంట్స్ లేకుండా, ఎవరి అండ లేకుండా ఇలా ఒంటరి పోరాట్సం చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు, సోదరుడు, పిల్లలు, ఏ కష్టం వచ్చినా నాతో పాటు నిలబడతానని వాగ్దానం చేసిన వ్యక్తి.. వీళ్లెవరూ లేని రోజు వస్తుందనుకోలేదు.
సైనికుడి కూతుర్ని
జీవితం ప్రతీది దూరం చేసింది. నేను నమ్మినవాళ్లు వదిలేసి వెళ్లిపోయారు. నాతో ఉంటానని హామీ ఇచ్చినవాళ్లు మౌనంగా మాట తప్పారు. అయినా ఈ తుపాను నన్ను నిలువునా ముంచేయలేదు. సముద్రంలోకి తీసుకెళ్లకుండా అలల్లా నన్ను ఒడ్డుకు విసిరేసింది. నాలోని ధైర్యాన్ని తట్టిలేపింది. చావును సైతం ఎదిరించే స్త్రీగా నిలవమంది. ఎందుకంటే నేను ఒక సైనికుడి కూతురిని. క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, పట్టుదల మా రక్తంలోనే ఉన్నాయి.
పోరాడుతూనే ఉంటా..
ప్రపంచం నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు ధైర్యంగా లేచి నిలబడటం నేర్చుకున్నా.. గుండె ముక్కలవుతున్నా పోరాడటం నేర్చుకున్నా.. అన్యాయం జరిగినప్పుడు కనికరం అవసరం లేదని తెలుసుకున్నా.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసేవరకు ప్రయత్నించడం నేర్చుకున్నా... నా సోదరుడి కోసం నేను పోరాడుతూనే ఉంటా.. అని రాసుకొచ్చింది.
నిర్బంధంలో నటి సోదరుడు
సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, గోల్‌మాల్ రిటర్న్స్, థాంక్యూ సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈమె సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 2024 నుంచి నిర్బంధంలో ఉన్నారు.
#courage #divorce | In the middle of the strongest most turbulent storm of my life I never imagined I would spend fighting alone, without any parents, without any support system I never thought there would come a day without all the pillars on which the roof of my world once… pic.twitter.com/J3algtzAO0
— Celina Jaitly (@CelinaJaitly) November 27, 2025
చదవండి: సౌత్ సినిమాల్లో బాలీవుడ్ హీరోలు విలన్లా? ఇదేం బాలేదు


