breaking news
Celina Jaitly
-
యానివర్సరీ గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ దాదాపు పదిహేనేళ్ల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహిస్తోన్నసూర్యం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. 2004లో వచ్చిన ఈ మూవీ తర్వాత సెలీనా తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేసింది. ఆమె హీరోయిన్గా నటించిన చివరి చిత్రం శ్రీమతి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. అలా దాదాపు 15 ఏళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తాజాగా బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సెలీనా.. తన పర్సనల్ లైఫ్, పెళ్లి జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఇండియాకు తిరిగి వచ్చానని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొద్దిమంది స్నేహితుల మద్దతుతో నా లైఫ్ తిరిగి ప్రారంభించానని చెప్పారు. ఆస్ట్రియాలో ఉన్నప్పుడే తన 15వ వివాహ వార్షికోత్సవానికి ముందు విడాకుల నోటీసులు వచ్చాయని తెలిపింది. ఆ నోటీసులు కూడా తాను చదవలేదని.. నా ఇద్దరు కవలలే చదివి వినిపించారని వెల్లడించింది. ఈ సందర్భంగా తన వైవాహిక సమస్యల గురించి మాట్లాడుతూ సెలీనా జైట్లీ కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి రోజు గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు పంపాడని తన బాధను వ్యక్తం చేసింది.విడాకుల కేసు విచారణ సమయంలో కూడా వేధింపులు ఎదుర్కొన్నానని సెలీనా జైట్లీ తెలిపింది. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉందని వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో ఒక పీడకలలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అనిపించిందని సెలీనా చెప్పుకొచ్చింది. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా తాను స్నేహపూర్వకంగా విడిపోవడానికి అంగీకరించానని.. తన ఆస్తులు, తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బు, పిల్లల ఉమ్మడి సంరక్షణ తప్ప మరేమీ తనకు అవసరం లేదని వెంటనే తన భర్త న్యాయవాదులకు ఒక అభ్యర్థన పంపానని తెలిపింది.విడాకుల కేసు సమయంలో ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చిందని వివరించింది. తన భర్త ఇంటి పై అంతస్తులో నివసిస్తుండగా.. నేను పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో ఉండేదాన్ని అని తెలిపింది. పిల్లలకు వారి జీవితంలో స్థిరపడే వరకు కొంతకాలం అక్కడే నివసించడానికి అనుమతి కూడా కోరానని ఆమె చెప్పింది. కానీ పిల్లలతో అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని నాకు అర్థమైందని తెలిపింది. ఆ తర్వాత సూపర్మార్కెట్లో క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని తనతో భర్త చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఇండియాలోని తన ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడే పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. దీంతో తాను అర్ధరాత్రి ఆస్ట్రియా నుండి తిరిగి వచ్చానని వెల్లడించింది. ఇల్లు లేకుండా భారతదేశానికి తిరిగి రావడం.. పది రోజుల పాటు హోటల్లో ఉంటూ తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రీతి జింటాతో పాటు ఇతర ఫ్రెండ్స్‌పై ఆధారపడ్డానని గుర్తు చేసుకుంది.కాగా.. సెలీనా జైట్లీ 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో విన్స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. ఆ తర్వాత 2017లో ఆర్థర్ అనే మరో కుమారుడు జన్మించారు. గతంలో ఓ కుమారుడు షంషేర్ గుండె సంబంధిత వ్యాధితో చనిపోయిందని తెలిపారు. 2025 నవంబర్‌లో గృహ హింస, భర్త వేధింపులకు తట్టుకోలేక ముంబయిలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. -
పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ: సిస్టర్ నివేదితగా సెలీనా
హీరోయిన్ సెలీనా జైట్లీ పదిహేనేళ్ల తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహించిన ‘సూర్యం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సెలీనా జైట్లీ సుపరిచితురాలే. 2004 డిసెంబరు 2న ఆ మూవీ విడుదలైంది. ఆ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేశారు.సెలీనా హీరోయిన్గా నటించిన చివరి చిత్రం ‘శ్రీమతి’. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సెలీనా తాజాగా బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత బయోపిక్‌లో ఆమె నటించనున్నారు. ఈ మూవీకి రామ్‌కమల్ ముఖర్జీ దర్శకుడు.‘‘సిస్టర్ నివేదిత సేవల గురించి నా చిన్నతనంలో మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆమె బయోపిక్‌లో కనిపించనుండటం మరపురాని అనుభవం. పదిహేనేళ్లు ఐరో పాలో గడిపిన నేను మళ్లీ మూలాలను వెతుక్కుంటూ మాతృదేశానికి తిరిగి వచ్చి, సనాతన ధర్మంతో అనుసంధానం కావడం హ్యాపీగా ఉంది’’ అని సెలీనా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... 1867లో ఐర్లాండ్‌లో జన్మించిన సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబెల్. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. 1911లో 43 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూశారు. -
భోరున విలపిస్తున్న మాజీ మిస్ ఇండియా : కారణం?
బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) ఒకపుడు అందాల ప్రపంచాన్ని ఏలిన తార. ఇపుడు అటు తీరని కడుపుశోకం, ఇటు తల్లిగా బిడ్డల్ని కలిసే పరిస్థితి లేక అల్లాడిపోతోంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అత్యంత బాధాకరమైన పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేయడం అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. భర్త పీటర్ హాగ్ నుండి విడాకులు తీసుకుంటున్న సమయంలో, తన పిల్లలను కలుసు కోనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తన పిల్లలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా అనుమతి లభించడం లేదని ఆమె ఆరోపించారు. సమాధిలో నిద్రిస్తున్న తన బిడ్డను కలుసుకోవడం తప్ప తనకు మరో గత్యంతరం లేదంటూ వాపోతున్నారు. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial)కుమారుడి సమాధి వద్ద కన్నీటి పర్యంతంసెలీనా ఆస్ట్రియాలో ఉన్న తన దివంగత కుమారుడు శంషేర్ సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తూ, దాన్ని శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. విడాకుల విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లిన తనకు, జీవించి ఉన్న తన ముగ్గురుపిల్లలను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేవలం మరణించిన కుమారుడిని మాత్రమే కలుసు కోగలిగానని ఆమె అత్యంత వేదనతో పేర్కొన్నారు. భర్త కెరీర్ కోసం తాను భారతదేశాన్ని, తన తల్లిదండ్రులను, సినిమా వృత్తిని వదులుకుని దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా వంటి దేశాలకు తిరిగానని గుర్తు చేసుకున్నారు. చివరికి తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నానని, వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తన పిల్లలకు తనపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా 'బ్రెయిన్ వాషింగ్' చేస్తున్నారని, మీడియాలో తనపై తప్పుడు కథనాలు వచ్చేలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సామరస్య పూర్వకంగా విడిపోవాలని తాను ప్రయత్నించినప్పటికీ, తన వద్ద ఉన్న మిగిలిన ఆస్తుల కోసం అవతలి పక్షం అహేతుకమైన డిమాండ్లు చేస్తోందని సెలీనా పేర్కొన్నారు.ఒక తల్లిగా తన బాధను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోను షేర్ చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.కాగా సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్(Peter Haag)ను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు (ట్విన్స్ విన్స్టన్-విరాజ్ మరియు చిన్న కుమారుడు ఆర్థర్) ఉన్నారు. ఆర్థర్ జంటగా పుట్టిన శంషేర్ అనారోగ్య కారణాలతో మరణించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత 2025 నవంబర్‌లో ముంబై కోర్టులో గృహ హింస కేసును దాఖలు చేస్తూ, తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నెలకు రూ.10 లక్షల భరణంతోపాటు రూ.50 కోట్ల పరిహారాన్ని పీటర్ నుంచి ఇప్పించాలన్నారు. ప్రస్తుతం తన పిల్లల కస్టడీ, న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ 2004లో విడుదలైన తెలుగు సినిమా ‘సూర్యం’లో నటుడు మంచు విష్ణు సరసన నటించారు. -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్‌పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
దయచేసి నా పిల్లల ఫోటోలను వాడకండి.. నటి విజ్ఞప్తి
భర్తపై గృహహింస కేసు నమోదు చేయడంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భర్త పీటర్ హాగ్ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఇటీవల ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సెలీనాపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. జాతీయ మీడియాలో ఆమెపై వరుస కథనాలు వస్తున్నాయి. వారి పిల్లల ఫోటోలను సైతం మీడియాలో చూపిస్తున్నారు. ఈ పరిణామాలతో బాధపడుతున్న సెలీనా జైట్లీ(Celina Jaitly )... మీడియాకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వివాదంలోకి తన పిల్లలను లాగొద్దని..వారి ఫోటోలను మీడియాలో ప్రసారం చేయొద్దని కోరింది. ‘నా గురించి రాసే వార్తల్లో మా పిల్లల ఫోటోలను వాడొద్దని మీడియాకు వేడుకుంటున్నా. నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని.. అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఓ తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది సెలీనా జైట్లి.పిల్లల గోప్యత, మానసిక భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సెలీనా విజ్ఞప్తికి సోషల్ మీడియాలో అనేక మంది మద్దతు తెలిపారు. అదే సమయంలో కొందరు మీడియా సంస్థలు ఇప్పటికీ పిల్లల ఫొటోలతోనే కథనాలు ప్రచురిస్తుండటం విమర్శలకు దారితీసింది.సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సెలీనా జైట్లీ ఆస్ట్రియాలోని వియన్నాలో తన కవల పిల్లలతో కలిసి ఉంటున్నారు. సెలీనా పెట్టిన గృహహింస కేసు డిసెంబర్ 12న విచారణకు రానుంది. pic.twitter.com/QLPr2BgnOV— Celina Jaitly (@CelinaJaitly) November 28, 2025 -
నేను జవాన్ కూతుర్ని.. ధైర్యం నా రక్తంలోనే ఉంది!
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోరుతోంది. భర్త, ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. అతడి వల్ల కోల్పోయిన రూ.50 కోట్లు తిరిగిప్పించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు యూఏఈలో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు, మాజీ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని తిరిగి తీసుకురావడం కోసం పోరాడుతోంది.ఒంటరి పోరాటంఈ క్రమంలో సెలీనా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. నా జీవితాన్ని అల్లకల్లోలం చేసే తుపాను ఒకటి వస్తుందని.. అప్పుడు పేరెంట్స్ లేకుండా, ఎవరి అండ లేకుండా ఇలా ఒంటరి పోరాట్సం చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు, సోదరుడు, పిల్లలు, ఏ కష్టం వచ్చినా నాతో పాటు నిలబడతానని వాగ్దానం చేసిన వ్యక్తి.. వీళ్లెవరూ లేని రోజు వస్తుందనుకోలేదు.సైనికుడి కూతుర్నిజీవితం ప్రతీది దూరం చేసింది. నేను నమ్మినవాళ్లు వదిలేసి వెళ్లిపోయారు. నాతో ఉంటానని హామీ ఇచ్చినవాళ్లు మౌనంగా మాట తప్పారు. అయినా ఈ తుపాను నన్ను నిలువునా ముంచేయలేదు. సముద్రంలోకి తీసుకెళ్లకుండా అలల్లా నన్ను ఒడ్డుకు విసిరేసింది. నాలోని ధైర్యాన్ని తట్టిలేపింది. చావును సైతం ఎదిరించే స్త్రీగా నిలవమంది. ఎందుకంటే నేను ఒక సైనికుడి కూతురిని. క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, పట్టుదల మా రక్తంలోనే ఉన్నాయి.పోరాడుతూనే ఉంటా..ప్రపంచం నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు ధైర్యంగా లేచి నిలబడటం నేర్చుకున్నా.. గుండె ముక్కలవుతున్నా పోరాడటం నేర్చుకున్నా.. అన్యాయం జరిగినప్పుడు కనికరం అవసరం లేదని తెలుసుకున్నా.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసేవరకు ప్రయత్నించడం నేర్చుకున్నా... నా సోదరుడి కోసం నేను పోరాడుతూనే ఉంటా.. అని రాసుకొచ్చింది.నిర్బంధంలో నటి సోదరుడుసెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈమె సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 2024 నుంచి నిర్బంధంలో ఉన్నారు. #courage #divorce | In the middle of the strongest most turbulent storm of my life I never imagined I would spend fighting alone, without any parents, without any support system I never thought there would come a day without all the pillars on which the roof of my world once… pic.twitter.com/J3algtzAO0— Celina Jaitly (@CelinaJaitly) November 27, 2025 చదవండి: సౌత్ సినిమాల్లో బాలీవుడ్ హీరోలు విలన్లా? ఇదేం బాలేదు -
'తీవ్ర మానసిక వేదన అనుభవించా'.. విదేశీ భర్తపై నటి ఫిర్యాదు.!
బాలీవుడ్ నటి, హీరోయిన్ సెలీనా జైట్లీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త వేధింపులకు గురి చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడ్డారని భర్త పీటర్ హాగ్పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వేధింపులతో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కోర్టుకు తెలిపారు. అతని వేధింపుల కారణంగా సైకోవెజిటేటివ్ ఓవర్‌లోడ్‌తో బాధపడుతున్నట్లు ప్రస్తావించారు. దాదాపు పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భర్త పీటర్ హాగ్పై గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. దీంతో ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు డిసెంబర్ 12 లోపు కోర్టు ముందు హాజరు కావాలని హాగ్కు నోటీసులు జారీ చేసింది. అయితే గత వారంలోనే తన భర్త హాగ్పై గృహ హింస పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.కాగా.. బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ.. పీటర్ హాగ్‌ను సెప్టెంబర్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా భర్త హాగ్ తనను మానసిక, శారీరక హింసకు గురి చేశారని ఆరోపించింది. 2019 తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయాని పిటిషన్లో పేర్కొంది. తన ఆస్తులు, ఆర్థిక నియంత్రణ అతని చేతికి అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది.నా బిడ్డ, తల్లిదండ్రులు కొన్ని నెలల వ్యవధిలో మరణించిన తర్వాత ముంబయిలోని తన నివాసాన్ని అతని పేరిట మార్చాలని తీవ్ర ఒత్తిడి చేశారని పిటిషన్లో వివరించింది. అయితే అంతకుముందే సెలీనా జైట్లీ జనవరి 14, 2019న తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని బాంబే సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. కాగా.. గతంలో ఆమె పీటర్‌కు ఉమ్మడి ఇంటి ఆస్తిని బహుమతిగా ఇచ్చింది. -
నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస, రూ. 50 కోట్లు చెల్లించాలి: మాజీ మిస్ ఇండియా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ (Celina Jaitly) విడాకులకు సిద్దమైంది. భర్త పీటర్ హాగ్ (Peter Haag-48)పై గృహ హింస కేసు దాఖలు చేసి, అతని వల్ల కోల్పోయిన ఆదాయం రూ. 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త అయిన హాగ్ కు నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది.తన భర్త తనను తాను గొప్పగా ఊహించుకుంటాడని (నార్సిసిస్ట్), స్వార్థపరుడని సెలీనా ఆరోపించారు. పిల్లల పట్ల ప్రేమలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అంతేకాదు ఆస్ట్రియాలో విడాకుల కోసం దాఖలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తాను ఇంట్లోనుంచి పారిపోయి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే సెలీనా తనకు నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది. ముంబైలోని తన నివాసంలోకి ప్రవేశించకుండా అతడిని నిరోధించాలని కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో హాగ్‌తో నివసిస్తున్న వారి ముగ్గురు పిల్లల కస్టడీ కూడా తనకు రావాలని పిటిషన్లో కోరింది. పిల్లలు పుట్టిన తరువాత ఏదో ఒక సాకుతో తనను పనిచేసుకోనీయకుండా అడ్డుపడ్డాడని.. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని హరించాడని ఆరోపించింది. అప్పుడప్పుడు చిన్న, చిన్న ప్రాజెక్టులను మాత్రమే చేయగలిగానని వెల్లడించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!కాగా, 2010లో నటి సెలినా జైట్లీ హగ్‌ను పెళ్లాడింది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 2012లో మగపిల్లలు (ట్విన్స్) పుట్టారు. తిరిగి ఏదేళ్ల తరువాత మళ్లీ ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు హైపోప్లాస్టిక్ గుండె కారణంగా మరణించారు. మాజీ మిస్ ఇండియా చమిస్ యూనివర్స్ రన్నరప్‌గా నిలిచిన సెలీనా.. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, మనీ హై తో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. మరోవైపు గత వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాగ్ కోసం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది. ఇంతలోనే ఈ విడాకుల వార్త అభిమానుల్లో అందోళన రేపింది. -
‘మిస్ వరల్డ్’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్ నటి
మిస్ వరల్డ్ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు స్పాన్సర్ల కార్యక్రమాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చిందని, నిర్దిష్ట దుస్తులు ధరించమని ఒత్తిడి చేయడం జరిగిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపించడం మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ దుబాయ్ నివాసి సెలీనా జైట్లీ(Celina Jaitly), మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.‘సౌందర్య వేదికల విలువను తక్కువగా అంచనా వేయడం బాధాకరం అన్నారామె. ‘అంతర్జాతీయ వేదిక అంటే ప్రొఫెషనలిజం, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం’’ అంటూ పేర్కొన్నారు. తాజాగా గల్ఫ్ న్యూస్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ మాట్లాడుతూ గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పోటీపడిన తన అనుభవం గుర్తు చేసుకున్నారు.‘ప్రపంచ మీడియా ముందు మీరు మీ దేశ ప్రతినిధిగా గౌరవంగా ఉండడం ఆవేదన చెందాల్సిన విషయం కాదు, గర్వించదగ్గ విషయం’’ అన్నారు. మిల్లా సిపిఆర్ శిక్షణ వంటి అంశాలను ముందుకు తెచ్చి పోటీకి సంబంధించిన మౌలిక అంశాలపై మార్పులు కోరడం సరికాదని సెలీనా అభిప్రాయపడ్డారు.వచ్చే 2025 చివరి నాటికి సౌందర్య పరిశ్రమ 667 బిలియన్ల డాలర్ల ఆదాయం, ఫ్యాషన్ రంగం 1.7 ట్రిలియన్ల విలువను సాధించబోతున్నాయని, ఈ రంగాలు కేవలం అందం గురించి కాక, కోటి మందికి ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అంతేకాక సంప్రదాయ సాంస్కృతిక విలువల వ్యక్తీకరణకు వేదికలుగా కూడా నిలుస్తున్నాయనీ చెప్పారామె. భారతదేశ సౌందర్య రాణుల జాబితాలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పిన జైట్లీ, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ‘అందాల వేదికలపై వారి విజయాల వల్లే అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఆర్ధికవ్యవస్థలోకి అడుగుపెట్టాయి. ఈ వేదికలను తక్కువ చేసి చూడడం బాధాకరం’’ అన్నారు.మిల్లా చేసిన ఆరోపణల్లో స్పాన్సర్లతో పాల్గొనడం ‘దుర్వినియోగం‘గా వర్ణించడాన్ని సెలీనా ఖండించారు. ‘స్పాన్సర్లతో సహకరించడం సందర్భానుసారంగా దుస్తులు ధరించడం వంటివి ఈ వేదికలో సహజమేనని చెప్పారు. ‘‘ ఇది హెచ్ఆర్ సెమినార్ కాదు, ఇది బ్యూటీ కాంటెస్ట్ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారామె మిల్లా చేసిన ప్రసంగాల్లో స్పాన్సర్ల కార్యక్రమాలను వ్యభిచారంతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జైట్లీ, ‘ఇలాంటి భాష వాడటం వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాదు. ఇది సాటి మహిళలను తక్కువ చేయడంతో పాటు కోటి మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలను అవమానించడం కూడా’’ అంటూ మండిపడ్డారు.‘ఒక సైనికుడి కూతురిగా సుదూర ప్రాంతాల్లో పెరిగాను. బ్యూటీ కాంటెస్ట్ వేదికలు నా జీవితాన్నే మార్చాయి. అందాల కిరీటం వల్లనే నేను ఐక్యరాజ్యసమితి, బాలీవుడ్ వేదికల వరకూ వెళ్లగలిగాను’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. వివాదాలు, తప్పుదోవ పట్టించే విమర్శల నడుమ, సెలీనా జైట్లీ చివరగా ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ‘‘ బ్యూటీ కాంటెస్ట్‌లు కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కట్టుబాటు, అంకితభావం, దేశ గౌరవం కోసం నిలబడే వేదికలు’’ -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor )ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టినందుకు హీరోయిన్ సెలీనా జైట్లీ(Celina Jaitly )కి బెదిరింపులు వచ్చాయి. భారత్‌ని ప్రశంసిస్తే అన్‌ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలినా ఈ ట్రోల్స్,బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్‌ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. ‘నా దేశం(భారత్) గురించి మాట్లాడితే అన్‌ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారందరిని నేను ఒకటే చెబుతున్నా.. క్షమాపణలు చేప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడాతాను. ఉగ్రవారదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారివైపు నేను ఉండను. భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను అన్‌ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్‌ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జైహింద్’అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ.. ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ..మనసంతా భారత్ గురించే ఆలోచిస్తుందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మరిచిపోలేమని ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై కొంతమంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడంపై పైవిధంగా స్పదించింది.మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్‌తో పాటు ఏడేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
శారీరకంగా, మానసికంగా గాయపడ్డా.. తప్పు నాదేనంటూ..
నలుగురు కుర్రాళ్లు వెంటపడితే మా టీచర్ అది నా తప్పే అనేసిందంటోంది హీరోయిన్ సెలీనా జైట్లీ. ఆడపిల్లలను ఇబ్బందిపెట్టేవారిని వదిలేసి బాధితులపైనే విమర్శలు చేయడం దారుణమంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. చిన్నప్పుడు జరిగిన చేదు సంఘటనలను పంచుకుంది. ఈ మేరకు చిన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేసింది.ఏవేవో కారుకూతలుఈ ఫోటో నేను ఆరో తరగతి చదువుతున్నప్పటిది.. నా బడి అయిపోగానే దగ్గర్లోని వేరే స్కూల్ అబ్బాయిలు నన్ను ఫాలో అయ్యేవారు. ఏవేవో కారుకూతలు కూసేవారు. నేనవేమీ పట్టించుకోనట్లు ఉండేదాన్ని. నేనసలు స్పందించకపోవడంతో కొన్ని రోజులకు నాపై రాళ్లు విసిరారు. నా పక్కన ఉన్న ఏ ఒక్కరూ దాన్ని చూసి స్పందించలేదు.తప్పంతా నాదేనా?మా టీచర్‌కు చెప్తే.. ఇదంతా నీవల్లే.. అని తప్పంతా నామీద వేసింది. వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నావ్.. లూజ్ బట్టలు ధరించట్లేదు. జుట్టుకు నూనె పెట్టి దువ్వుకోకుండా హెయిర్ లీవ్ చేస్తున్నావ్.. అందుకే ఇవన్నీ అని చెప్పింది. ఒకసారైతే స్కూల్ రిక్షా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వీళ్లంతా ఎందుకిలా చేస్తున్నారు? నిజంగా నేనేమైనా తప్పు చేశానా? అని కొన్నేళ్లపాటు నాలో నేనే బాధపడ్డాను.బ్రేకుల వైర్లు కట్11వ తరగతికి వచ్చేసరికి స్కూటీ బ్రేకుల వైర్లు కట్ చేశారు. బ్రేకులు పడకపోవడంతో నన్ను నేను కాపాడుకోవడానికి స్కూటీపై నుంచి జంప్ చేశాను. ఎంతో గాయపడ్డాను. అప్పుడు కూడా మా క్లాస్ టీచర్..జీన్స్ వేసుకుని స్కూటీపై రావడం వల్ల నిన్ను లూజ్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, అందుకే ఇలా చేస్తున్నారంది. శారీరకంగా, మానసికంగా గాయపడ్డాను.ఆయనపైనా కుళ్లు జోకులుఏది జరిగినా నా తప్పే అంటున్నారు. మన దేశం కోసం రెండు యుద్ధాల్లో పాల్గొన్న మా తాతయ్య (రిటైర్డ్ కల్నల్) నన్ను తిరిగి స్కూలుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆయనపైనా అబ్బాయిలు కుళ్లు జోకులు వేశారు. వారిని చూసి అసహ్యించుకుని సైలెంట్‌గా ముందుకు కదిలాడు. జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులం కాదు. అని సెలీనా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది.సినిమాలు..2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సూర్యం మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు: స్టార్ హీరోయిన్
సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది' 'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది' 'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
'ఫేమస్ నైట్ గర్ల్.. చేసినవన్నీ అడల్ట్ సినిమాలే, డైరెక్టర్ ఎదుటే..'
ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు రోజుకో బ్రేకింగ్ న్యూస్ వదులుతాడు. ఆ హీరోకు పెళ్లైనా అఫైర్లు ఉన్నాయని, ఈ హీరోయిన్ కాల్ గర్ల్ అని, వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని, ఛాన్సులకోసం సదరు నటి చాలామందితో బెడ్ షేర్ చేసుకుందని, కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్, మందు తీసుకున్నారని ఇలా రోజుకో పుకారు సృష్టిస్తుంటాడు. కొందరు దీన్నీ చూసీచూడనట్లు వదిలేస్తారు. మరికొందరేమో అతడు అనే మాటలను తట్టుకోలేక రియాక్ట్ అవుతారు. తాజాగా అదే పని చేసింది బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ. 'సెలీనా.. తండ్రీకొడుకులైన ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌లతో శారీరకంగా చాలాసార్లు కలిశారు' అని ట్వీట్ చేశాడు ఉమైర్. దీనిపై మండిపడ్డ నటి.. 'మీకు ఏదో సమస్య ఉందనుకుంటా.. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఇలాంటివారిపై ట్విటర్ చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేసింది. తనపైనే ఎదురుదాడి చేయడంతో ఉడుక్కున్న ఉమైర్.. నటి గురించి అసభ్యంగా మాట్లాడుతూ వరుస ట్వీట్లు చేశాడు. 'నోర్మూయ్.. నువ్వొక సీ గ్రేట్ నటివి. అన్నీ సాఫ్ట్ పోర్న్ సినిమాలే చేశావు. తర్వాత బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయావు. స్వార్థపరురాలా. ట్విటర్.. ఈ సైకో నన్ను వేధిస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోండి. అయినా 2003లో జనాషీన్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడలేదా? సమాధానం చెప్పు.. పైగా నాకు ఏదో రోగం ఉందంటున్నావ్. నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకున్నావ్ కదా అప్పుడే ఆ సమస్య వచ్చింది. 2006, 2007 సంవత్సరాల్లో ముంబైలో నువ్వొక ఫేమస్ నైట్ గర్ల్‌వి. సీ గ్రేడ్ భోజ్‌పురి నటివైన నీకు నా ట్వీట్‌తో పబ్లిసిటీ వచ్చింది. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పాలి' అని పేర్కొన్నాడు. వీరి మధ్య జరిగిన వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రిటిక్ ఉమైర్ సంధు She slept with me in Austria 🇦🇹 that’s why she knows I’ve erectile dysfunction 😛 ! Btw you were famous “ Night Girl ” in Mumbai in 2006 & 2007. Thanks to me , you got publicity from my tweet. C Grade Bhojpuri Actress 😄😘 https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Oh Just Shutup ! You were a C Grade Actress. Look at your Filmography. You always did Soft Porn Films. Ok ! Married with a Rich guy & then settled down ! Selfish woman. @TwitterSafety this psychopath is harassing me. Take notice. https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Sach Kafi Zaiyda Karwa Lag gaya !! Bataon sub ko ! You were naked infront of Director Feroze Khan in his office during Janasheen auditions in 2003. https://t.co/gZg1usZ23C — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 -
మిస్టర్ సంధు.. వెంటనే డాక్టర్‌ను కలవండి.. గట్టిగా ఇచ్చిపడేసిన నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన జనషీన్ చిత్రంతో సెలీనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా నటీనటులపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండే సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీ సమస్య త్వరలోనే నయమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారామె. కాగా.. ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ నటులైన తండ్రీ, కుమారులు ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో శారీరకంగా చాలాసార్లు కలిశారంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ఘాటూగా స్పందించింది. సెలీనా ట్వీట్లో రాస్తూ.. 'మిస్టర్ సంధు.. ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మనిషిగా మారడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. అలాగే మీ లైంగిక పటుత్వ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి. ఇలాంటి వారిపై దయచేసి ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దివంగత నటుడు ఫిరోజ్ ఖాన్ సెలీనా జైట్లీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనషీన్ చిత్రీకరణ సమయంలో ఫిరోజ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తనను యువరాణిలా భావించారని నటి పేర్కొంది. ఈ చిత్రానికి ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సెలీనా నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da — Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023 -
ముగ్గురు పిల్లలున్న నటికి పెళ్లి ప్రపోజల్.. ఇల్లరికమైనా ఓకే అంటూ..
హీరోయిన్ల అందచందాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు అబ్బాయిలు. వారి ఫోటోలను వాల్పేపర్లుగా పెట్టుకుని మురిసిపోయేవారు కొందరైతే సెల్ఫీలు దిగి షేర్లు చేసేవారు మరికొందరు. అయితే కొద్దిమంది మాత్రం సదరు హీరోయిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని పట్టపగలే కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటారు. తాజాగా ఓ నెటిజన్ కూడా అదే ఊహలో మునిగిపోయాడు. బాలీవుడ్ నటి, మోడల్ సెలీనా జైట్లీ తనకు భార్య అయితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడు. 'సెలీనా జైట్లీ.. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పందిస్తావని ఎదురుచూస్తున్నాను. ఇట్లు కోల్‌కతా నుంచి విజయ్ మగన్‌లాల్ వోరా' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన సెలీనా వెరైటీగా రిప్లై ఇచ్చింది. 'నా భర్తను, ముగ్గురు పిల్లలను అడిగాక వస్తాను' అంటూ తెలివిగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 11 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్‌తో పాటు ఐదేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. I will ask my husband and three kids and revert ! https://t.co/jIEXG8pEVD — Celina Jaitly (@CelinaJaitly) April 6, 2023 -
మీరు కూడా అడుక్కుంటున్నారా?.. హీరోయిన్‌పై నెటిజన్ సెటైర్లు
ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్‌పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్‌లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు. మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY — Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023 దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్‌గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు. I'm reminded of this gender only at Traffic signals 🚦🤣 — Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023 -
తనయుడి మృతి.. నటి భావోద్వేగం
న్యూఢిల్లీ: పొత్తిళ్లలో పాపాయిని చూడగానే అప్పటివరకు పడ్డ పురిటినొప్పులను మరచిపోతుంది మాతృమూర్తి. తన ప్రతిరూపాన్ని చూసుకుని మురిసిపోతూ బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. అలాంటిది.. పసిప్రాయంలోనే బిడ్డ తన నుంచి దూరమై, శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కడుపుకోత ఒకేలా ఉంటుంది. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కూడా ఇలాంటి బాధను అనుభవించారు. నెలలు నిండకుండానే జన్మించిన తన తనయుడు షంషేర్ గుండె జబ్బుతో మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే సందర్భంగా మంగళవారం తన మనోగతాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.(చదవండి: నా కుమారుడు అలా.. నాకిష్టం లేదు : సోనూ నిగమ్) ‘‘నెలలు నిండకుండానే ఏటా లక్షలాది మంది శిశువులు జన్మిస్తున్నారు. వారు ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు నవంబరు 17,2011న వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డేను సృష్టించారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు. నియోనటల్ కేర్(నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులను ఉంచే ప్రత్యేక ఐసీయూ)లో శిశువులను ఉంచినప్పుడు తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. చనుబాలు పట్టించడం, వైద్యులపై నమ్మకం ఉంచితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. మా విషయంలో ఇది నిరూపితమైంది. ఓ బిడ్డ ఎన్ఐసీయూలో ఉండగా, మరో బిడ్డ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆ గుండెకోత వర్ణించలేం. అయితే దుబాయ్ వైద్యుల నిర్విరామ కృషి వల్ల మా ఆర్థర్ హాగ్ మాతోపాటు ఇంటికి రాగలిగాడు. కొన్ని సమస్యలు ఎదురైనా ప్రస్తుతం తను బాగానే ఉన్నాడు. విన్స్టన్ చర్చిల్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి ప్రముఖులతో పాటు మా ఆర్థర్ కూడా ప్రిమెచ్యూర్ బేబీనే. మా ఆర్థుకు మీ ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రిమెచ్యూర్ బేబీలు కూడా ఆర్థులాగే చలాకీగా మారిపోతారు’’ అని సెలీనా చెప్పుకొచ్చారు. కాగా మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచిన సెలీనా, మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2012లో కవలలు(విన్స్టన్, విరాజ్), 2017లో కవలలు(షంషేర్, ఆర్థర్) జన్మించారు. షంషేర్ గుండెలోపంతో మృతి చెందగా.. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. WORLD PREMATURITY DAY 17 Nov While nothing prepares parents for how it feels to have a preemie baby, it’s a huge support to know others have been where they are now. @peterhaag & I assure you things do also get better. #WorldPrematurityDay Read More: https://t.co/TJhq51URMM pic.twitter.com/Bh33gyd5ka — Celina Jaitly (@CelinaJaitly) November 18, 2020 -
హృతిక్, సెలీనాలపై సోషల్ మీడియా ఫైర్
న్యూఢిల్లీ: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండ పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు టైస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం ఈ వార్తలు చదివి కలవర పడిన భారతీయులు ఇదే సంఘటనపై బాలివుడ్ నటుడు హృతిక్ రోషన్, సామాజిక కార్యకర్త, గే హక్కుల కోసం పోరాడుతున్న సెలీనా జైట్లీ పంపిన ట్వీట్లు చూసి కంగుతిన్నారు. ‘ఇదేమి చీప్ పబ్లిసిటీ!’ అంటూ ఈసడించుకున్నారు. వారిద్దరు సెలబ్రిటీల స్పందనలను ఎండగడుతూ కౌంటర్ ట్వీట్లు చేశారు. విశ్రాంతి కోసం ఇద్దరు పిల్లలతో టాంజానియా వెళ్లిన తాను టైస్టుల దాడులకు కొన్ని గంటల ముందు ఇస్తాంబుల్‌లో ఆగానని, అక్కడి నుంచి మరో విమానంలో రావాలంటే ఒకరోజు ఆగాల్సి వచ్చేదని, అయితే తాను ఎకానమీ క్లాస్‌లో సర్దుకొని భారత్‌కు వచ్చానని, ఓ మతం కోసం అక్కడ అమాయకులను చంపారని, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనమంతా నిలబడాలంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియా మండిపడింది. టెర్రరిస్టుల దాడుల్లో 41 మంది అమాయకులు మరణించి, 238 మంది గాయపడి తాము బాధ పడుతుంటే తమరు ఎకానమీ క్లాస్‌లో వచ్చారని జాలి చూపాలా అంటూ పలువురు విమర్శించారు. ‘నా ప్రజలు చనిపోతే ఎకానమీ క్లాస్ గురించి మాట్లాడుతావా?....ప్రజలు చనిపోవడంకన్నా ఎకానమీ క్లాస్‌లో హృతిక్ ప్రయాణించడం ఎక్కువ హారిబుల్‌గా ఉన్నట్టుంది....హృతిక్‌కు మతిపోయింది....ఆయనకు పిసరంతా కూడా మెదడు లేదు....ఆయన మాటలు పట్టించుకోకండి, నేను ఈ క్షణాన ప్రపంచం కోసం నిజంగా బాధ పడుతున్నా...’ అంటూ పలువురు ట్వీట్ చేశారు. ఫ్లోరిడాలోని మయామిలో నెల రోజుల క్రితం జరిగిన హార్వే మిల్క్ ఫౌండేషన్ సన్మాన కార్యక్రమానికి హాజరైన తాను వచ్చేటప్పుడు ఇస్తాంబుల్ మీదుగా వచ్చానని, అక్కడ టెర్రరిస్టుల దాడి జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సెలీనా జైట్లీ వ్యాఖ్యానించడంపై కూడా ట్విట్టర్లో మండిపడ్డారు. ‘అసలు నీకేమైంది? మిల్క్ ఫౌండేషన్ గురించి, సన్మానం గురించి మాట్లాడాల్సిన సందర్భమా ఇది!.....నీవు నిజంగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉండి ఉంటే బాధితులతో కలసి సెల్ఫీలు తీసుకునే దానివేమో!’ అంటూ కొందరు మండిపడ్డారు. వీటిపై సెరీనా జైట్లీ స్పందిస్తూ తాను ప్రస్తావించిన ఇతర అంశాలను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలని, తనకు దురుద్దేశాలు అంటగట్టవద్దని, తనను క్షమించాలని కోరారు. -
ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'
విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు. జీఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గాజుల మాణిక్యాలరావు విడుదల చేయనున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శివకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, సురేష్ కొండేటికి ఇచ్చారు. వి. సాగర్, సునీల్‌కుమార్‌రెడ్డి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. సినిమా పరిశ్రమ మీద మమకారంతో వచ్చిన ఈ నిర్మాత చేసిన తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నానని శివకృష్ణ అన్నారు. కథలో విషయముంటేనే ఉపేంద్ర సినిమాలు చేస్తాడని, ఈ చిత్రం కొత్తగా ఉంటుందని ఊహిస్తున్నానని వి.సాగర్ చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సునీల్‌కుమార్‌రెడ్డి, సురేష్, ఘంటాడికృష్ణ మాట్లాడారు.


