ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్' | Upendra's 'XYZ' Audio Launch in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'

Sep 9 2013 12:45 AM | Updated on Sep 1 2017 10:33 PM

ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'

ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'

విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు.

విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు. జీఎంఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గాజుల మాణిక్యాలరావు విడుదల చేయనున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. 
 
 శివకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, సురేష్ కొండేటికి ఇచ్చారు. వి. సాగర్, సునీల్‌కుమార్‌రెడ్డి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. సినిమా పరిశ్రమ మీద మమకారంతో వచ్చిన ఈ నిర్మాత చేసిన తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నానని శివకృష్ణ అన్నారు. 
 
 కథలో విషయముంటేనే ఉపేంద్ర సినిమాలు చేస్తాడని, ఈ చిత్రం కొత్తగా ఉంటుందని ఊహిస్తున్నానని వి.సాగర్ చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సునీల్‌కుమార్‌రెడ్డి, సురేష్, ఘంటాడికృష్ణ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement