ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా కష్టాలు తప్పవు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. రీసెంట్‌గా ఓ వార్త చదివే ఉంటారు. రజనీకాంత్ హీరోగా చేసిన ఓ హిందీ మూవీ దాదాపు 40 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుంది. ఇందులో అప్పటి హిందీ స్టార్ యాక్టర్స్ నటించారు. అయినా సరే పలు కారణాల వల్ల ఇన్నాళ్లకు బిగ్ స్క్రీన్‌పై విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఇలానే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఓ కన్నడ చిత్రానికి మోక్షం లభించింది.
(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా అలరించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా పలకరిస్తునే ఉన్నాడు. ఇతడు హీరోగా 2007లో మొదలైన కన్నడ చిత్రం 'రక్త కాశ్మీర'. రమ్య హీరోయిన్. కమర్షియల్ కథతోనే దీన్ని తెరకెక్కించారు. దీని విషయంలో మూవీని మించిన డ్రామా అయితే ఉంది. ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయనే చెప్పొచ్చు.
ఈ సినిమాలోని ఓ పాటలో ఏకంగా 14 మంది హీరోలు కనిపించారు. ఇప్పుడు సినిమా రిలీజయ్యే సమయానికి అందులో ముగ్గురు హీరోలు (పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్) మరణించారు. మరో హీరో దర్శన్ జైలులో ఉన్నాడు. హీరోయిన్ రమ్య అయితే ఇండస్ట్రీకే దూరమైపోయారు. విచిత్రం ఏంటంటే కన్నడలో ఈ సినిమా ఈ రోజు (జనవరి 30) థియేటర్లలో రిలీజైంది. కానీ ఇదొచ్చిన సంగతి హీరో ఉపేంద్ర కూడా తెలియదని టాక్ అయితే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు రిలీజ్ చేశారో? ఏంటో?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)


