మాట నిలబెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ | Allu Arjun Helps To Durga first month deposit credited to her account | Sakshi
Sakshi News home page

Allu Arjun: మాట నిలబెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mar 19 2026 5:22 PM | Updated on Mar 19 2026 5:31 PM

Allu Arjun Helps To Durga first month deposit credited to her account

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనూ శెభాష్ ‍అనిపించుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

తాజాగా తాను ఇచ్చిన మాటను అల్లు అర్జున్‌ నిలబెట్టుకున్నారు.  తండ్రిని కోల్పోయిన దుర్గ అనే యువతికి రూ.7,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన స్క్రీన్‌షాట్‌ను బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు  మరణించారు. అంతేకాకుండా ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది.   మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ  ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు.

అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్‌ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను  వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్‌ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌  తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement