ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ రేసు గుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ మూవీతో రవి కిషన్ టాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయారు. విలన్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం రోల్ ఎప్పటికీ గుర్తుంటుంది. చివరి 30 నిమిషాల్లో బ్రహ్మనందం అదరగొట్టేశారు. ఈ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 8న రేసుగుర్రం 4కె వర్షన్‌లో థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి మద్దాలి శివారెడ్డి విలనిజం, బ్రహ్మనందం ఫుల్ యాక్షన్ మోడ్ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇవాళ ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Wishing everyone a very Happy Ugadi 🥭#RaceGurram4K is all set to hit theatres on April 8, 2026 mark the date in your calendars !!
Get ready to witness the madness of this iconic character once again and experience the frenzy on the big screen 🔥@alluarjun @shrutihaasan… pic.twitter.com/kSQDq2c512— Race Gurram 4K (@RGTheFilm) March 19, 2026


