పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకుల పత్రం..: నటి | Celina Jaitly Says Husband Served Divorce Notice On Pretext Of Anniversary Gift | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజు గిఫ్ట్‌గా విడాకులు.. నా పిల్లలతో మాట్లాడనివ్వట్లేదు

Jan 14 2026 5:05 PM | Updated on Jan 14 2026 5:43 PM

Celina Jaitly Says Husband Served Divorce Notice On Pretext Of Anniversary Gift

పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్‌ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్‌ హగ్‌పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు  దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..

పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకులు..
సెప్టెంబర్‌ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. 

వేధింపులు తట్టుకోలేక..
అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్‌ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్‌లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.

పిల్లలకు దూరం
ఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు  పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్‌ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.

శత్రువుగా చిత్రీకరిస్తున్నారు
పిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్‌ హగ్‌ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్‌మాల్‌ రిటర్న్స్‌, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement