దయచేసి నా పిల్లల ఫోటోలను వాడకండి.. నటి విజ్ఞప్తి | Celina Jaitly Requests Media Not To Use Her Children Photos In Her News Coverage | Sakshi
Sakshi News home page

దయచేసి నా పిల్లల ఫోటోలను వాడకండి.. మీడియాకు నటి విజ్ఞప్తి

Nov 29 2025 1:56 PM | Updated on Nov 29 2025 3:04 PM

Celina Jaitly Requests Media Not To Use Her Children Photos In Her News Coverage

 భర్తపై గృహహింస కేసు నమోదు చేయడంలో బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా  సెలీనా జైట్లీ  పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భర్త పీటర్‌ హాగ్‌ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఇటీవల ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సెలీనాపై  రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. జాతీయ మీడియాలో ఆమెపై వరుస కథనాలు వస్తున్నాయి. వారి పిల్లల ఫోటోలను సైతం మీడియాలో చూపిస్తున్నారు. ఈ పరిణామాలతో బాధపడుతున్న సెలీనా జైట్లీ(Celina Jaitly )... మీడియాకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వివాదంలోకి తన పిల్లలను లాగొద్దని..వారి ఫోటోలను మీడియాలో ప్రసారం చేయొద్దని కోరింది. 

‘నా గురించి రాసే వార్తల్లో మా పిల్లల ఫోటోలను వాడొద్దని మీడియాకు వేడుకుంటున్నా. నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని.. అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఓ తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నాను’ అంటూ ట్వీట్‌ చేసింది సెలీనా జైట్లి.

పిల్లల గోప్యత, మానసిక భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సెలీనా విజ్ఞప్తికి సోషల్ మీడియాలో అనేక మంది మద్దతు తెలిపారు. అదే సమయంలో కొందరు మీడియా సంస్థలు ఇప్పటికీ పిల్లల ఫొటోలతోనే కథనాలు ప్రచురిస్తుండటం విమర్శలకు దారితీసింది.

సెలీనా జైట్లీ, పీటర్‌ హాగ్‌ 2010లో ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సెలీనా జైట్లీ ఆస్ట్రియాలోని వియన్నాలో తన కవల పిల్లలతో కలిసి ఉంటున్నారు. సెలీనా పెట్టిన గృహహింస కేసు డిసెంబర్‌ 12న విచారణకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement