
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.
ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్‌బస్టర్ వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
🎙️ Jr NTR begins dubbing for #WAR2.
The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025