దీపిక నాకు దూరం అవుతుందేమో? | Kangana Complains about Deepika to Hritik | Sakshi
Sakshi News home page

హృతిక్‌-కంగనా మెయిళ్లలో దీపిక ప్రస్తావన!

Oct 5 2017 2:39 PM | Updated on Aug 21 2019 10:25 AM

Kangana Complains about Deepika to Hritik  - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల మధ్య మాటల తుటాలు మళ్లీ మొదలు కావటంతో..  పాత వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి ఈ-మెయిల్స్ సంభాషణలను కీలక సాక్ష్యాలుగా పోలీసులు విచారణ చేపట్టగా..  తాజాగా వాటిలో దీపిక పదుకొనే పేరు ప్రస్తావనకు రావటం సంచలనంగా మారింది. 

ప్రముఖ జర్నలిస్ట్‌ అర్నబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ ఈ మేరకు ఓ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.  అందులో దీపిక ప్రవర్తన గురించి కంగనా హృతిక్‌ వద్ద ప్రస్తావించింది.  ‘దీపిక వ్యవహారాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. నా మనసులో దీపికపై మంచి అభిప్రాయం లేదని, ఆమె గత నాలుగు రోజులుగా నాకు ఫోన్ కాల్స్ చేయదు. తన గురించి నాకు తెలిసిపోయినట్టు భావించబట్టే, దీపిక నాకు దూరం అవుతోందని అనుకుంటున్నా' అంటూ కంగానా ఆ మెయిల్స్‌లో ప్రస్తావించిందంట. 

దీపిక అర్థరహితమైన పనులతో తాను విసుగు చెందినట్టు కంగనా హృతిక్‌ తో చెప్పుకుంది. ఆమెపై తనకెన్నో సందేహాలున్నాయని, తనకు భయంగా ఉందని, ఏడవాలని ఉందంటూ హృతిక్‌కు చెప్పుకుని బాధపడింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గతంలోనే చాలాసార్లు హృతిక్ కంగనా కోరినట్లు కూడా ప్రస్తావించింది. మొత్తానికి వీరిద్దరి మధ్య వ్యవహారంలోకి మరో అగ్ర హీరోయిన్‌ పేరు రావటం బాలీవుడ్‌ లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. దీనిపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement