మరికొన్ని గంటల్లో ‘వార్‌ 2’ రిలీజ్‌.. హృతిక్‌, ఎన్టీఆర్‌ రిక్వెస్ట్‌ | Jr NTR, Hrithik Roshan Urge Fans To Say No To War 2 Spoilers Ahead Of Release | Sakshi
Sakshi News home page

సీక్రెట్స్‌ రివీల్‌ చేయకండి: హృతిక్‌, ఎన్టీఆర్‌ రిక్వెస్ట్‌

Aug 13 2025 5:13 PM | Updated on Aug 13 2025 5:31 PM

Jr NTR, Hrithik Roshan Urge Fans To Say No To War 2 Spoilers Ahead Of Release

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌లు కలిసి నటించిన వార్‌ 2 చిత్రం మరికొన్ని గంటల్లో(ఆగస్ట్‌ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ  దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్‌ అవుతుండడంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్‌ చేశారు.

‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి. స్పాయిలర్‌లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.

‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి’ అని ఎన్టీఆర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement