‘వార్‌ 2’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Jr NTR And Hrithik Roshan War 2 Movie Twitter Review In Telugu, Check These Tweets Before Watching The Film | Sakshi
Sakshi News home page

War 2 Twitter Review: ‘వార్‌ 2’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Aug 14 2025 6:30 AM | Updated on Aug 14 2025 8:48 AM

War 2 Movie Public Talk And Twitter Review

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్‌ చిత్రం వార్‌ 2. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్‌. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్‌ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్‌,హృతిక్‌లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్‌ & మైనస్‌ పాయింట్స్‌ ఏంటి  తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.  ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

ఎక్స్‌లో వార్‌ 2 సినిమాకు  మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్‌ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్‌ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్‌, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయని చెబుతున్నారు.

వార్‌2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్‌ యాక్షన్‌ సీన్‌ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్‌ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వార్‌2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ (VFX)లో  కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ పనితీరు మెప్పించలేదంటున్నారు.

ఇంట‌ర్వెల్‌, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయ‌ని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్‌ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి  యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్‌ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.




 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement