సినిమా ఆగిపోయిందన్నారు.. కట్ చేస్తే హీరోనే డైరెక్టర్ | Hrithik Roshan Turns Director For Krrish 4 Movie | Sakshi
Sakshi News home page

Hritik Roshan: తన సినిమాకే తానే హీరో కమ్ డైరెక్టర్

Mar 28 2025 1:11 PM | Updated on Mar 28 2025 1:37 PM

Hrithik Roshan Turns Director For Krrish 4 Movie

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. 2019లో చేసిన వార్ హిట్ అవగా.. తర్వాత చేసిన విక్రమ్ వేదా, ఫైటర్ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి.

ప్రస్తుతం హృతిక్.. వార్ 2 మూవీ చేస్తున్నాడు. దీనిపై దక్షిణాదిలో బజ్ ఉంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉ‍న్నాయి. దీని తర్వాత క్రిష్ 4ని హృతిక్ చేయబోతున్నాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)

బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మూవీతో హృతిక్.. దర్శకుడిగా మారబోతున్నాడని ఈ హీరో తండ్రి రాకేశ్ రోషన్ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు.

క్రిష్ ఫ్రాంచైజీలో ఇదివరకే మూడు సినిమాలు వచ్చాయి. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 ఇప్పటికే రిలీజయ్యాయి. మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి త్వరలో క్రిష్ 4 తీయబోతున్నారు, అది కూడా హృతిక్ డైరెక్టర్ అంటే ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement