మహాకాల్‌ వివాదం.. ఆ యాడ్‌ను నిలిపేస్తున్నాం: జొమాటో క్షమాపణలు

Zomato apologises after row over Hrithik Roshan Mahakal ad - Sakshi

భోపాల్‌: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన మహాకాల్‌ వాణిజ్య ప్రకటన వివాదం కావడం తెలిసే ఉంటుంది. boycott zomato ట్రెండ్‌ కూడా సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో క్షమాపణ చెప్పింది. తాము పేర్కొన్న మహాకాల్‌ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదంటూ వివరణిచ్చింది. 

ఆ ప్రకటనలో హృతిక్‌..‘ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్‌ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్‌ నుంచే తెప్పించుకుని తింటా’ అని అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉజ్జయిని కలెక్టర్‌.. మహాకాల్‌ ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ అశిష్‌ సింగ్‌ స్పందిస్తూ.. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని, అలాంటిది ఈ యాడ్‌ వాళ్ల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో.. తమ ప్రకటన ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్‌ రెస్టారెంట్‌కు మాత్రమే సంబంధించిందని జొమాటో వివరణ ఇచ్చుకుంది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని జొమాటో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మహాకాల్‌ దైవప్రసాదం.. అవమానిస్తారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top