Hrithik Roshan Vikram Vedha Alcoholia Video Song Released - Sakshi
Sakshi News home page

Hrithik Roshan:హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్

Sep 17 2022 8:26 PM | Updated on Sep 17 2022 8:52 PM

Hrithik Roshan Vikram Vedha Song Alcoholia Video Song Released - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘విక్రమ్‌ వేద’. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్‌ హిట్‌ ‘విక్రమ్‌ వేద’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. పుస్కర్‌, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. 

తాజాగా ఈ చిత్రంలోని ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను ఆ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో హృతిక్‌ రోషన్‌ తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. హృతిక్‌రోషన్‌ హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. గణేశ్‌ హెగ్డే కొరియోగ్రాఫి అందించారు. కాగా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విక్రమ్‌వేద చిత్రాన్ని వైనాట్‌ స్టుడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement