'ఇరుముడి'లో ఆ సీన్స్ తొలగించాలి: ఏపీ టీచర్లు | Irumudi Scenes Removed Demand By Andhra Pradesh Teachers | Sakshi
Sakshi News home page

Irumudi-Ap Teachers: 'ఇరుముడి'లో సన్నివేశాలపై ఆంధ్రా టీచర్ల ఆగ్రహం

Aug 25 2026 9:59 AM | Updated on Aug 25 2026 12:28 PM

Irumudi Scenes Removed Demand By Andhra Pradesh Teachers

ప్రభుత్వ స్కూల్క్, టీచర్లని కించపరిచేలా 'ఇరుముడి'లో ఉన్న సీన్స్ తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శకులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)

'సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం సినిమా. ఒక పాత్రని తెరపై ఎలా చూపిస్తారో అదే ముద్ర సమాజంలో మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు లాంటి అంశాలని సినిమాలో చూపించేటప్పుడు దర్శకులు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. 'ఇరుముడి'లో గవర్నమెంట్ స్కూల్ లేడీ టీచర్ పాత్రని నెగిటివ్‌గా చూపించారు. ఇది కేవలం కల్పిత పాత్ర కాదు. ఆమె వెనక ఏపీలోని ఓ పాఠశాల కనిపిస్తోంది. పిల్లలు వేసుకున్న యూనిఫామ్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ ఒక్కటే. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీసిన ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది' అని పేర్కొన్నారు.

సినిమా అద్భుతంగా ఆడుతున్న టైంలో ఇలాంటి విషయం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. విచిత్రం ఏంటంటే సోమవారం జరిగిన సక్సెస్ మీట్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించిన దర్శకుడు శివ నిర్వాణ.. తాను కూడా గతంలో టీచర్‌గా పనిచేశానని, ఈ వృత్తిలో ఉన్న బ్యాడ్ సైడ్ చూపించానని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement