సాక్షి,తాడేపల్లి : ‘హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అంటూ ఏపీలో ఆలయాల కూల్చివేతల అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేయించింది. ఈ మహాపచారంపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి. చంద్రబాబు పాలనలో ఆలయాలపై విధ్వంసకాండ కొనసాగుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన అంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లు కూల్చివేశాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోంది.
తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపం కూల్చివేతతో మొదలైన విధ్వంసం..కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాల కూల్చివేశారు. బద్వేల్‌లోని కాశినాయన జ్యోతి క్షేత్రంలోనూ సత్రాలను కూల్చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా పవిత్ర ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా పాలన అంటే?.
దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక ఆలయాలను కూల్చివేస్తోంది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పే చంద్రబాబు..ఆలయాలను కూల్చివేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు?. సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా చంద్రబాబూ..?. ఆలయాలను కాపాడే బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదీ చదవండి : ఆలయాలు కూల్చివేస్తూ సనాతన ధర్మ పరిరక్షణా? : భూమన
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 23, 2026


