ఏపీలో 2024 పోలింగ్ గణాంకాల మధ్య ఇంత భారీ వ్యత్యాసం: యోగేంద్ర | Such a massive disparity during the 2024 polling in AP Yogendra | Sakshi
Sakshi News home page

ఏపీలో 2024 పోలింగ్ గణాంకాల మధ్య ఇంత భారీ వ్యత్యాసం: యోగేంద్ర

Nov 23 2026 5:51 PM | Updated on Nov 23 2026 6:00 PM

 Such a massive disparity during the 2024 polling in AP Yogendra

ఆంధ్రప్రదేశ్‌-2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన‍్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కూడా ఎన్నోసార్లు ఈ విషయంపై పలు అంశాలను లేవతెత్తారు. ఇదే విషయంపై ‘‘ది రిపోర్టెర్స్‌ కలెక్టివ్‌’’ ఇచ్చిన నివేదికను ‘‘స్వరాజ్‌ ఇండియా’’ ఫౌండర్ యోగేంద్ర యాదవ్ పోస్ట్‌ చేస్తూ పలు విషయాలు ప్రస్తావించారు.  
 
‘‘2024లో ఎన్నికల్లో అక్రమాలు జరిగి ఉండవచ్చనే అనుమానాలను ఈ కథనం లేవనెత్తుతోంది. ఈ సంచలనాత్మక పరిశోధనలోని తొలి రెండు భాగాలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) రికార్డుల నిర్వహణలోని తీవ్రమైన లోపాలు, తప్పిదాలను బయటపెట్టాయి. మూడో కథనం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఉండవచ్చనే అవకాశాన్ని సూచిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత నమోదైన పోలింగ్ గణాంకాల మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని వివరించడం అంత సులువు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలస్యంగా జరిగిన పోలింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభాకర్ పరకాల చాలాకాలంగా మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ తాజా కథనం ఆయన వాదనను నిజమని నిరూపిస్తోంది’’ అని తెలిపారు.

కాగా, ‘‘2024లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అంతర్గత రికార్డుల్లో నమోదైంది. అయితే, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి కేవలం 24,596 మంది మాత్రమే ఓటు వేసినట్లు లెక్కల్లో చూపించారు. ఈ రెండు గణాంకాల మధ్య 31,000కు పైగా ఓట్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ, ఈ భారీ తేడాపై ఈసీఐ ఎప్పుడూ విచారణ జరపలేదు’’ అని ఈ వివరాలను జర్నలిస్టు సుమీధ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement