బాబు జమానాలో... ప్రజాస్వామ్యం అపహాస్యం! | Double Voter Entries in Rajam Municipality Raise Concerns Ahead of Elections | Sakshi
Sakshi News home page

బాబు జమానాలో... ప్రజాస్వామ్యం అపహాస్యం!

Nov 23 2026 12:59 PM | Updated on Nov 23 2026 1:16 PM

Double Voter Entries in Rajam Municipality Raise Concerns Ahead of Elections

విజయనగరం: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఎంతగా అపహాస్యం పాలవుతుందో ప్రజలంతా చూస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి విత్‌డ్రాల వరకు ఒక రకమైన అధికార దురి్వనియో గం జరుగుతుంటే... మరోవైపు లెక్కింపు ప్రక్రియ లో కూడా గెలిచిన అభ్యర్థులు రీకౌంటింగ్‌ పేరిట ఓటమి పాలవడం... ఓడిన వారు విజేతలు కావడం దేశమంతా చూస్తోంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఇంతగా తూట్లు పడుతున్నా... ఇవి చాలదన్నట్టు ఓటర్ల డబుల్‌ ఎంట్రీలు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

అది కూడా ప్రజాప్రతినిధుల ఓట్లు డబుల్‌ ఎంట్రీలు కావడం నిశ్చేష్టను చేస్తున్నాయి. బాబు జమానాలో ప్రజాసామ్యం ఎంతగా పరిహాసించబడుతుందో చెప్పేందుకు రాజాం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీల భాగోతమే ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే...   రాజాం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంతో సంబంధం లేని కొందరు వ్యక్తుల ఓట్లు ఇక్కడ ఉండడం, ఇక్కడి ఓట్లు మరో ప్రాంతంలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ వార్డుల్లో కొత్త పేర్లు, చిరునామాలు కనిపిస్తుండడంతో బరిలో నిలిచిన వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రాజాం మున్సిపాలిటీలో ప్రతీ చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది.   


రాజాం 27వ వార్డులో వంగర మండల టీడీపీ జెడ్పీటీసీ ఓటు   

బీఎల్‌ఓల మెతకవైఖరి 
మున్సిపాల్టీ వార్డుల విభజన సమయంలో చాలా వరకు ఓట్లు తారుమారయ్యాయి. ఇక్కడ ఓట్లు మరో వార్డులో... ఇంకో వార్డులోని ఓట్లు మరో చోట ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర మండలాల ఓటర్ల ఓట్లు, ఆయా వార్డులకు చెందిన స్థానిక ఓటర్లు ఓట్లు డబుల్‌ ఎంట్రీలు జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు అభ్యర్థుల గెలుపొటములపై ప్రభావం చూపనున్నాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వార్డుల పునర్విభజన సమయంలో ఓటర్లు వివరాలు క్రమబద్దీకరించకపోవడం, డెత్‌లు తొలగించకపోవడం, పలుచోట్ల కొత్తవారి ఓట్లును ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఇక్కడ చేర్చడంతో ఈ పరిస్థితి దాపురించిందని వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులు వాపోతున్నారు. జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తి పేరు కూడా అటు వంగర మండలంలో.. ఇటు రాజాం మున్సిపాలిటీలో ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి ఓటర్ల జాబితాలతో ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రభుత్వం ఏం చెబుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ బినామీ ఓట్లుపై దృష్టి సారించి, ఎన్నికల పోలింగ్‌ సమయంలో దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.  


రాజాం 27వ వార్డులో డబుల్‌ ఎంట్రీలో పలువురి ఓట్లు   

మా వార్డులో వంగర ఓట్లు 
పట్టణంలోని 27వ వార్డులో వంగర మండలం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ టీడీపీ జెడ్పీటీసీ ఓటు ఇక్కడకు ఎలా వచ్చిందో తెలి యడం లేదు. టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థికి రెండు ఓట్లు వచ్చాయి. పలువురి పేర్లతో రెండేసి ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలు సజావు గా జరిగేలా లేవు. ఏవో కుట్రలు పన్నుతున్నట్టు అనుమానం వస్తుంది. ఎన్నికల అధికారులు ఈ తప్పిదాలను సరిచేయాలి. లేకుంటే ప్రజాస్వా మ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులను కాలరాసినట్టే అవుతుంది. అధికారులు ఏం చేస్తారో చూడాలి.               
– శిఖప్రసాద్, 27వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి, రాజాం  

ఎక్కడి ఓట్లో... ఇక్కడ... 
రాజాం మున్సిపాల్టీ పరిధి 27వ వార్డులో వంగర మండలం టీడీపీ జెడ్పీటీసీగా ఇటీవల గెలిచిన గణపతి ఓటు ఉంది. అతని సోదరుడు ఓటు సై తం ఇదే వార్డులో ఉండడం విస్తుగొలుపుతుంది. ఇలా వంగర మండలానికి చెందిన 20కి పైగా ఓ ట్లు 27వ వార్డులో దర్శనమిచ్చాయి. ఇదే వార్డులో కౌన్సిలర్‌ బరిలో ఉన్న ఓ వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయి. మరికొందరి ఓట్లు డబుల్‌ ఎంట్రీ అయ్యాయి. ఇలా ఈ ఒక్క వార్డులోనే 50 వరకూ డబుల్‌ ఎంట్రీ ఓట్లు, ఇతర ప్రాంతాల ఓట్లు ఉన్నాయి. వీటిలో అధికంగా తెలుగుదేశం పార్టీకి  చెందిన వారి ఓట్లు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాల్టీలో ఇలా 400లకు పైగా ఓట్లు పక్క ప్రాంతాలకు చెందిన వారికి ఉన్నాయని పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  

ఇదీ చదవండి: షర్మిలకు బాబు సర్కారు భారీ నజరానా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement