పవన్‌కు షాకిచ్చిన మంత్రి ఆనం.. | Political Clash Between Janasena And TDP At Nellore | Sakshi
Sakshi News home page

పవన్‌కు షాకిచ్చిన మంత్రి ఆనం..

Nov 23 2026 12:31 PM | Updated on Nov 23 2026 12:37 PM

Political Clash Between Janasena And TDP At Nellore

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అధికార కూటమిలో రాజకీయ వివాదానికి దారితీసింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన అభ్యర్థికి కాకుండా మరో కౌన్సిలర్‌కు అవకాశం కల్పించడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యంతోనే అభ్యర్థి మార్పు జరిగిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి.

జనసేన తరఫున వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా శిరీష పేరును పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చివరి నిమిషంలో ఆమెకు బదులుగా జనసేన కౌన్సిలర్‌ పద్మ పేరును తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో స్థానిక జనసేన నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇక, అభ్యర్థి ఎంపికలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకున్నారని జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీధర్‌ ఆందోళనకు దిగారు. తమ పార్టీ అధినేత ప్రకటించిన అభ్యర్థిని కాదని మరో పేరును ఎలా ఖరారు చేస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిరసనలు తెలుపుతున్న శ్రీధర్‌తో పాటు పలువురు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

కూటమిలో సమన్వయంపై ప్రశ్నలు
ఈ నేపథ్యంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చకు దారితీసింది. జనసేన అధినేత ప్రకటించిన అభ్యర్థి విషయంలోనే వివాదం తలెత్తిందన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. కాగా, నేడు మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. 

ఇదీ చదవండి: షర్మిలకు బాబు సర్కారు భారీ నజరానా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement