జనసేన సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌ | Jana Sena Sarpanch Candidate Allegedly Kidnapped by TDP Leaders in Anantapur District | Sakshi
Sakshi News home page

జనసేన సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌

Nov 23 2026 12:25 PM | Updated on Nov 23 2026 12:29 PM

Jana Sena Sarpanch Candidate Allegedly Kidnapped by TDP Leaders in Anantapur District

టీడీపీ నాయకులపై అమడగూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న జనసేన నాయకులు

అనంతపురం: మండలంలోని జేకేపల్లి సర్పంచ్‌ స్థానానికి జనసేన మద్దతుతో పోటీ చేస్తున్న ఉత్తప్ప కిడ్నాప్‌ అయ్యాడు. టీడీపీ నాయకులే ఈ పని చేశారని జనసేన నాయకులు అమడగూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఉత్తప్పను స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి చేశారు. ఇందుకు అతను ససేమిరా అన్నాడు. దీంతో ఆదివారం సాయంత్రం ఉత్తప్ప ఇంట్లో ఉండగా టీడీపీ నాయకులు వచ్చి ‘నీతో మాట్లాడేది ఉంది’ అంటూ బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.

స్థానిక టీడీపీ నాయకులు కమ్మల లక్ష్మీనారాయణ, తనకంటి నరేంద్ర, కమ్మల పెద్దన్నయ్య, మరికొందరు కలసి కిడ్నాప్‌ చేశారని ఉత్తప్ప కుమార్తె తేజస్విని తెలిపారు. ఈ మేరకు జనసేనకు చెందిన మార్కెట్‌యార్డు చైర్మన్‌ పూల శివప్రసాద్, ఆ పార్టీ నాయకులు తోట్ల గంగాధర్‌ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎస్‌ఐ గోపాల్‌కృష్ణ మాట్లాడుతూ ఉత్తప్ప ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కనుగొంటామని తెలిపారు.   

ఇదీ చదవండి: సర్పంచ్‌ బరిలో తోడికోడళ్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement