‘నా దైవం వైఎస్‌ జగన్ సాక్షి’గా అంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ప్రమాణం | YSRCP Corporator Swears Oath in the Name of My God, YS Jagan | Sakshi
Sakshi News home page

‘నా దైవం వైఎస్‌ జగన్ సాక్షి’గా అంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ప్రమాణం

Nov 23 2026 3:28 PM | Updated on Nov 23 2026 3:45 PM

YSRCP Corporator Swears Oath in the Name of My God, YS Jagan

సాక్షి,వైఎస్సార్‌ కడప: మున్సిపల్‌ కార్పొరేషన్‌ 33వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దిక సంధ్యారాణి ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మద్దిక సంధ్యారాణి ప్రమాణం చేస్తూ..‘నా దైవం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షిగా నా బాధ్యతలను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. తన పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని ఆమె ఈ విధంగా చాటుకున్నారు. ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement