ఆలయాలు కూల్చివేస్తూ సనాతన ధర్మ పరిరక్షణా? : భూమన | Pawan Kalyan Sanatan Dharma Temple Demolition | Sakshi
Sakshi News home page

ఆలయాలు కూల్చివేస్తూ సనాతన ధర్మ పరిరక్షణా? : భూమన

Nov 23 2026 2:19 PM | Updated on Nov 23 2026 2:31 PM

Pawan Kalyan Sanatan Dharma Temple Demolition

సాక్షి, తిరుపతి: వేల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం నేలమట్టం కావడంతో వివాదం రేగింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ఈ క్రమంలో ఆలయ తొలగింపును అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, పల్లవ రాజుల కాలం నాటి ఈ పురాతన ఆలయంలో అగస్త్య మహాముని, అన్నమయ్య, కంచి చంద్రశేఖర్‌ స్వామీజీ పూజలు చేసినట్లు భూమన పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే జాతీయ రహదారి డిజైన్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కక్ష సాధింపు ధోరణితో ఆలయాన్ని తొలగించారని భూమన ఆరోపించారు. దాంతోపాటు సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. పురాతన హిందూ ఆలయాల తొలగింపును ఎలా సమర్థిస్తారని, ఆలయాల పరిరక్షణ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. హిందూ ఆలయాల పరిరక్షణ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని భూమన కరుణాకర్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు.

ఇదీ చదవండి: ఉదయం ఓ మాట.. సాయంత్రం మరోమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement