ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ | Asia Power Index, India Ranks As Asia 3rd Most Powerful Nation In 2026, PM Modi Named 2nd Most Powerful Leader | Sakshi
Sakshi News home page

ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్

Nov 23 2026 3:24 PM | Updated on Nov 23 2026 3:36 PM

India 3rd Biggest Asian Power, PM Modi 2nd Most Effective Leader

సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలో భారత్ తన శక్తిని మరింత బలోపేతం చేసుకుంటోంది. లోవీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన 2026 ఆసియా పవర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం.. భారత్‌ ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ నివేదికలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మొదటి స్థానంలో ఉన్నారు. మొత్తం శక్తివంతమైన దేశాల జాబితాలో 40.5 శాతంతో భారత్‌ ఉంది.

ఈ సంధర్బంగా 2026 ఆసియా పవర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం.. ఆర్థిక అంచనాలు, దౌత్య ప్రభావం, రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రభావం భారత్‌ బలాన్ని పెంచాయని తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్‌ క్షిపణుల విక్రయాలు, రక్షణ సహకారం కారణంగా భారత్‌ రక్షణ సంబంధాల విభాగంలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది.

అయితే బలహీనపడుతున్న రూపాయి, విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 20 బిలియన్‌ డాలర్ల తగ్గుదల, ఆర్థిక సామర్థ్యంలో కొంత క్షీణత భారత్‌కు ప్రతికూలంగా మారాయని ఈ నివేదిక వెల్లడించింది. గల్ఫ్‌ సంఘర్షణ సమయంలో భారత్‌ దౌత్యపరమైన ప్రభావం తగ్గిందని, మోదీ నాయకత్వంపై అంచనాలు కూడా కొంత తగ్గాయని పేర్కొంది.

ఇక మరోవైపు, అమెరికా-చైనా మధ్య సైనిక శక్తి సామర్థ్యాల తేడా కూడా తగ్గుతోంది. అమెరికా పవర్‌ స్కోరు 78.9 కాగా, చైనా స్కోరు 73.6గా ఉంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఎక్కువగా నిమగ్నం కావడంతో ఆసియాపై దాని దృష్టి తగ్గిందని నివేదిక తెలిపింది. చైనా తన సైనిక, నౌకాదళ సామర్థ్యాలను పెంచుకుంటూ తైవాన్‌, ఫిలిప్పీన్స్‌తో ప్రాంతీయ ఉద్రిక్తతలను కొనసాగిస్తోందని ఈ నివేదిక పేర్కొంది.

అయితే భారత్‌ బలం పెరిగినప్పటికీ చైనాతో పోలిస్తే మాత్రం భారత్‌కు ఉన్న శక్తి తేడా 2018 నుంచి ఇప్పటివరకు అత్యల్ప స్థాయికి చేరింది. దాంతో చైనా శక్తి భారత్‌ కంటే ఇంకా 80 శాతం అధికంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement