యూపీలో హ్యాట్రిక్‌పై కమలం గురి!  | BJP plan to prepare for the upcoming State Assembly Polls | Sakshi
Sakshi News home page

యూపీలో హ్యాట్రిక్‌పై కమలం గురి! 

Nov 23 2026 4:35 AM | Updated on Nov 23 2026 4:35 AM

BJP plan to prepare for the upcoming State Assembly Polls

నియోజకవర్గాల్లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు 

బూత్‌ స్థాయిలో బైకర్ల బృందాలు 

రంగంలోకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

వారంలో రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ పక్కాగా ముందుకు కదులుతోంది. ఇటీవల మథురలో జరిగిన ‘చింతన్‌ బైఠక్‌’(మేధోమథన సదస్సు), ఆ తర్వాత ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసాల్లో జరిగిన వరుస మారథాన్‌ సమావేశాల అనంతరం ప్రచార ప్రణాళికకు తుదిరూపం ఇచ్చారు. 

ఎన్నికల వ్యూహాల అమలులో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఆయన వారంలో రెండు రోజులు యూపీలోనే మకాం వేసి, క్షేత్రస్థాయిలో పార్టీ వ్యూహాల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. వ్యూహంలో భాగంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో మోటార్‌ సైకిళ్లు కలిగిన 11 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. 

వీరు పక్షం రోజుల్లో కనీసం 5 రోజుల పాటు బైక్‌ యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తారు. అలాగే ప్రతి బూత్‌కు ఐదుగురు ముఖ్య కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 మంది ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ 15 తర్వాత వీరంతా పూర్తిస్థాయిలో ప్రచార బరిలోకి దిగనున్నారు. 

అసమ్మతి నేతల బుజ్జగింపు 
కాషాయ దళంలో నిరాశ, అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తల జాబితాను మండలా ల వారీగా సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ మొద టి 15 రోజుల్లో వీరందరినీ బుజ్జగించి, తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసే ందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. అదేవిధంగా, నియోజకవర్గాల వారీగా కుల సమీకరణాలను బేరీజు వేసుకుంటూ, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను, వివిధ రంగాల్లో చురుగ్గా ఉన్న మహిళలను పార్టీ వైపు తిప్పుకునేలా వ్యూహాన్ని రచించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మంది మహిళలను క్రియాశీలక ప్రచారంలో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement