టాటా మోటార్స్ తన సియెర్రా కారును లెజెండ్ సిరీస్ పేరుతో కొత్త లైనప్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వేరియంట్ డిజైన్ ఎలా ఉంది?, అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లెజెండ్ సిరీస్ ఇప్పటికే ఉన్న సియెర్రాతో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. డిజైన్ విషయంలో చెప్పుకోదగ్గ అప్డేట్ లేనప్పటికీ.. కొన్ని ప్రీమియం ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది. ఇది ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్స్‌తో సహా పలు రంగుల ఎంపికలతో లభిస్తుంది.
లెజెండ్ సిరీస్‌లో లెదరెట్ సీట్లు, లెదరెట్ డోర్ ట్రిమ్‌లు, ఆర్మ్‌రెస్ట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో ఫోల్డింగ్ ORVMలు, ఫుల్ కవర్లతో కూడిన 17 ఇంచెస్ స్టీల్ వీల్స్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రామాణిక ఫీచర్లతో ప్రధాన భద్రతా అంశాలు యథాతథంగా కొనసాగుతాయి.
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్ ఆడియో, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రియర్ వాష్-వైప్ వంటివి లభిస్తాయి. ఫీచర్స్ అనేవి ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి.
లెజెండ్ సిరీస్ కోసం పవర్‌ట్రెయిన్ ఎంపికలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వేరియంట్‌ను బట్టి 6 మాన్యువల్, 6 ఆటోమాటిక్, 7DCA ఎంపికలతో పాటు రెవోట్రాన్ 1.5 లీటర్ పెట్రోల్, క్రయోజెట్ 1.5 లీటర్ డీజిల్, హైపెరియన్ 1.5 లీటర్ TGDI ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: పాత రూ.10 నోటు చూశారా.. ఈ విషయం తెలుసా?


