Toyota Urban Cruiser Hyryder: ప్రత్యర్థులకు చెమటలే! ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..

Toyota Urban Cruiser Hyryder launched in indian markets - Sakshi

సాక్షి, ముంబై:  టయోటా కిర్లోస్కర్ మోటార్  ప్రపంచ ఈవీ దినోత్సవం  సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని శుక్రవారం లాంచ్‌ చేసింది. వీటి ధరలరూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది. నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్న దీని టాప్-స్పెక్ నియో డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) వేరియంట్ రూ. 17.09 లక్షలు,  హై వేరియంట్‌ ధర రూ. 18,99,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. 

2022 జూలైలో దీన్ని తొలిసారి పరిచయం చేసిన సంస్థ దాదాపు రెండు నెలల తర్వాత దీన్ని తీసు​కొచ్చింది. ఇప్పటికే మోడల్ కోసం అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. టయోటా ఇండియా డీలర్‌షిప్‌లలోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.  అలాగే  త్వరలోనే ధరను ప్రకటించనున్న మారుతి సుజుకి  గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీకి కూడి ఇది పోటీగా నిలవనుందని అంచనా.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్)
S eDrive 2WD హైబ్రిడ్ రూ. 15.11 లక్షలు
G eDrive 2WD హైబ్రిడ్ రూ. 17.49 లక్షలు
V eDrive 2WD హైబ్రిడ్ రూ. 18.99 లక్షలు
V AT 2WD నియో డ్రైవ్ రూ. 17.09 లక్షలు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో బలమైన హైబ్రిడ్ టెక్‌తో e-CVTతో  వస్తుంది.  ఇది  91 bhp & 122 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ 79 bhp, 141 ​​Nm ను ప్రొడ్యూస్‌ చేస్తుంది.  అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు ఇంత అద్భుతమైన స్పందన లభిస్తోందంటూ వినియోగదారులకు అసియేట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్  అండ్‌ మార్కెటింగ్ అతుల్ సూద్ ధన్యవాదాలు తెలిపారు.

ఫీచర్లు: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ , సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంటుంది.  6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి  టాప్‌  ఫీచర్లుఇందులోఉన్నాయి. టయోటా iConnect టెక్నాలజీ సహా క్రూయిజ్ కంట్రోల్, 55 ప్లస్ ఫీచర్లు  లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top