Lamborghini Aventador Ultimae: వావ్‌..లిమిటెడ్‌ ఎడిషన్‌ స్పోర్ట్స్‌కార్: హాట్‌ సేల్‌

Lamborghini Aventador Ultimae Limited  Edition Launched In India - Sakshi

లగ్జరీ స్పోర్ట్స్‌కార్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే 

600  యూనిట్లు మాత్రమే అందుబాటులో 

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ కార్‌ బ్రాండ్ లంబోర్ఘిని మరో సూపర్‌ కారును భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే పేరుతో లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్‌ను తీసుకొచ్చింది.  ప్యూర్‌ పెట్రోల్ వీ12 ఇంజన్‌తో ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది.  కూపే, రోడస్టర్‌  రెండు వేరియంట్లలో దీన్ని పరిచయం చేసింది. కూపే మోడల్‌లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్‌లో  250 యూనిట్లను విక్రయించనుంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమేపనితీరు-స్పెసిఫికేషన్లు... కొంత మార్పు చేసినప్పటికీ, అవెంటడార్‌ ఎస్‌వీజే, అవెంటడార్‌ ఎస్‌ మాదిరిగానే ఉండనున్నాయి.  

లంబోర్ఘిని అవెంటడార్‌  LP780-4 Ultimae  ఫీచర్లు
అత్యంత శక్తివంతమైన 6,498 సీసీ వీ12 ఇంజన్. ఇది 770bhp వద్ద 8,500ఆర్‌పీఎంను,  6,750 ఆర్‌పీఎం వద్ద  720 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. కొత్త స్టైలింగ్, కొత్త ఫ్రంట్ బంపర్, మాసివ్ సైడ్ స్కర్ట్‌లు, రియర్‌ డిఫ్యూజర్, 20- అంగుళాల అల్లాయ్ వీల్స్ 7- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌, గరిష్టంగా గంటలకు 355 కిలోమీటర్ల వేగం లాంటి ఇతర ఫీచర్లు ఈ కారుసొంతం. అవెంటడార్‌ ఎస్‌ కంటే ఇది  25 కిలోల బరువు తక్కువ.

అయితే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన కార్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయట. ఇండియాలో ఒక్కరు మాత్రమే ఈ  కారును సొంతం చేసుకున్నారు.  అయితే ఈ కారు ధరను  లంబోర్ఘిని వెల్లడించలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top