Ola S1 Air Launched With 110CC e-Scooter With Special Offer - Sakshi
Sakshi News home page

Ola S1 Air e-Scooter: తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్‌1 ఎయిర్‌ వచ్చేసింది..సర్‌ప్రైజ్‌ ఆఫర్‌

Oct 22 2022 3:53 PM | Updated on Oct 22 2022 4:43 PM

Ola S1 Air Launched With 110cc Scooter with special offer - Sakshi

సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్‌1 ఎయిర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్‌  చేసింది.  ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్‌ బడ్జెట్‌ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్‌1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్‌1 ఎయిర్‌ను తీసుకురావడం గమనార్హం.

రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ను ఆవిష్కరించింది.  ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే   లాంచింగ్‌ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.  ఈ లాంచింగ్‌ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్‌తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్‌లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్‌లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు.

అధునాతన డిజైన్‌తో అప్‌డేట్‌ చేసిన ఎస్‌1 ఎయిర్‌ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్‌తో సహా మూడు రైడింగ్ మోడ్స్‌లో, అయిదు రంగుల్లో  లభించ నున్నాయి.  ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ,  ‍మ్యూజిక్‌ అండ్‌ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం.

Advertisement
 
Advertisement
Advertisement