జియో బంపరాఫర్‌.. 6 నెలల ఫ్రీ రీఛార్జ్‌తో 4G ఫోన్! | Jio Anniversary Offer on JioBharat Celebrating 10 Years of Connecting Bharat | Sakshi
Sakshi News home page

జియో బంపరాఫర్‌.. 6 నెలల ఫ్రీ రీఛార్జ్‌తో 4G ఫోన్!

Oct 1 2026 4:34 PM | Updated on Oct 1 2026 4:59 PM

Jio Anniversary Offer on JioBharat Celebrating 10 Years of Connecting Bharat

దేశంలో డిజిటల్‌ కనెక్టివిటీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న జియో.. తన 10వ వార్షికోత్సవం సందర్భంగా మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

4జీ ఫోన్‌.. రూ.1,499
జియో అందిస్తున్న ఆఫర్‌లో భాగంగా జియో భారత్ 4జీ ఫోన్‌ను రూ.1,499కి అందిస్తున్నారు. అంతేకాదు.. ఫోన్‌తో పాటు ఆరు నెలల పాటు ఉచిత కనెక్టివిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో ప్రతి నెల 14జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సాధారణంగా 2జీ వినియోగదారులు నెలకు దాదాపు రూ.199 రీఛార్జ్‌ చేసుకుంటే, ఆరు నెలలకు సుమారు రూ.1,200 ఖర్చవుతుంది. ఇప్పుడు జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో రూ.1,499కే 4జీ ఫోన్‌తో పాటు ఆరు నెలల కనెక్టివిటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ లెక్కన చూస్తే..  2G నుంచి 4Gకి అప్‌గ్రేడ్‌ అయ్యే ఫోన్‌ ఖర్చు కేవలం రూ.299 మాత్రమే అవుతుంది.

500లకు పైగా టీవీ ఛానల్స్
జియో భారత్ కేవలం ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకే పరిమితమయ్యే సాధారణ ఫీచర్‌ ఫోన్‌ కాదు. ఇందులో జియో టీవీ ద్వారా 500లకు పైగా టీవీ ఛానళ్లు చూడొచ్చు. లైవ్‌ క్రికెట్‌, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. డిజిటల్‌ చెల్లింపులు చేసుకునే అవకాశం కూడా ఉంది. జియోపే ద్వారా యూపీఐ పేమెంట్స్‌, పేమెంట్‌ అలర్ట్స్‌, సౌండ్‌బాక్స్‌ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కనెక్ట్‌గా ఉండేందుకు సేఫ్టీ ఫీచర్లు, లొకేషన్‌ మానిటరింగ్‌ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఇక ఫోన్‌ విషయానికి వస్తే.. ఇది 2.4 అంగుళాల డిస్‌ప్లే పొందుతుంది. 2000mAh బ్యాటరీ, 4G కనెక్టివిటీ ఉన్నాయి. అంటే.. సాధారణ ఫీచర్‌ ఫోన్‌ కంటే మరిన్ని డిజిటల్‌ సదుపాయాలను తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇప్పటికీ 2G ఫోన్‌ వాడుతున్న వారికి 4G ప్రపంచంలోకి అడుగుపెట్టేలా జియో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: భూకంపం వచ్చినా ఇల్లు సేఫ్‌.. జపాన్‌ కొత్త టెక్నాలజీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement