మామ డబ్బిస్తే ఇల్లు భార్యదే.. భర్తకు హక్కు ఉండదు! | Wife Owns Joint Property If Father Paid, Kerala HC Orders | Sakshi
Sakshi News home page

మామ డబ్బిస్తే ఇల్లు భార్యదే! భర్తకు హక్కు సున్నా

Oct 1 2026 12:23 PM | Updated on Oct 1 2026 12:47 PM

Wife Owns Joint Property If Father Paid, Kerala HC Orders

వైవాహిక జీవితంలో భార్యాభర్తల పేరిట ఉమ్మడిగా నమోదైన ఆస్తికి సంబంధించి కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. రిజిస్ట్రేషన్ పత్రాల్లో భార్యాభర్తలిద్దరి పేర్లు ఉన్నప్పటికీ ఆ ఆస్తి కొనుగోలుకు అవసరమైన పూర్తి మొత్తాన్ని భార్య తండ్రి చెల్లించినట్లు ఆధారాలతో నిరూపితమైతే సదరు ఆస్తిపై పూర్తి హక్కు భార్యకే దక్కుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త మూడు నెలల వ్యవధిలో దాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించింది. జస్టిస్ సతీష్ నైనన్, జస్టిస్ పి.కృష్ణకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది.

కేసు నేపథ్యం

బాధితురాలు తన తండ్రి సమకూర్చిన నిధులతో కొనుగోలు చేసిన సుమారు 7 సెంట్లు స్థలం, నివాస గృహంపై పూర్తి హక్కులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణలో ఆమె తండ్రి బ్యాంక్ ఖాతా నుంచి ఆస్తి కొనుగోలు రోజున రూ.25 లక్షలు విత్‌డ్రా అయినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆధారంగా రుజువైంది. కాగా, తాను విదేశాల్లో ఉన్న తన బావమరిది ద్వారా డబ్బులు ఇచ్చానని భర్త వాదించినప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ, సాక్ష్యాలను కానీ కోర్టు ముందు ఉంచలేకపోయారు. తొలుత ఫ్యామిలీ కోర్టు భర్త సగం ఆస్తికి రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించగా, ఈ తీర్పును సవాలు చేస్తూ ఇరుపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి.

కోర్టు కీలక వ్యాఖ్యలు

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (సాక్ష్యాధారాల చట్టం) సెక్షన్ 92 నిబంధనలను, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ సెక్షన్ 14 పరిధిని పరిశీలించిన బెంచ్.. వైవాహిక వివాదాలను పరిష్కరించే క్రమంలో నిజమైన ఆధారాలను స్వీకరించే పూర్తి అధికారం ఫ్యామిలీ కోర్టులకు ఉంటుందని ఉద్ఘాటించింది. కుమార్తె సంక్షేమం కోసమే ఆమె తండ్రి పూర్తి సొమ్మును చెల్లించినట్లు స్పష్టంగా రుజువైనందున ఆ ఆస్తికి ఆమె ఏకైక యజమానిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement