రెండు దశాబ్దాల్లో 30 బిలియన్‌ డాలర్లు | Walmart Sourced Goods Worth Over USD 30 Billion From India | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల్లో 30 బిలియన్‌ డాలర్లు

Feb 19 2024 4:23 AM | Updated on Feb 19 2024 4:23 AM

Walmart Sourced Goods Worth Over USD 30 Billion From India - Sakshi

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌ నుంచి గత రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సోర్సింగ్‌ విభాగం) ఆండ్రియా ఆల్‌బ్రైట్‌ తెలిపారు. ఇప్పుడు 2027 నాటికల్లా ఏటా 10 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.

వాల్‌మార్ట్‌ గత 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వాల్‌మార్ట్‌ గ్రోత్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమనేది దిగ్గజ సరఫరాదారులతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అలాగే దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థ కోసం కొత్త సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకునేందుకు తోడ్పడగలదని ఆల్‌బ్రైట్‌ చెప్పారు.

చిన్న, మధ్య తరహా సంస్థల ఆధునీకరణ, విస్తరణలో తోడ్పడేందుకు ఉద్దేశించిన వాల్‌మార్ట్‌ వృద్ధి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 వేల మందికి కంపెనీ శిక్షణనిచి్చనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రోత్‌ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న వాల్‌మార్ట్‌ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ తెలిపారు. హీరో ఎకోటెక్‌ తయారు చేసే క్రూయిజర్‌ సైకిళ్లు, మిసెస్‌ బెక్టర్స్‌ ఉత్పత్తులు, వెల్‌స్పన్‌ టవళ్లు మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement